మ‌హేష్ ‘స్పైడ‌ర్ మ్యాన్’ టీజ‌ర్‌ అదుర్స్‌..

mohanrao
mahesh

మ‌హేష్ బాబు అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న స్పైడ‌ర్ మ్యాన్ టీజ‌ర్‌ విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ టీజర్ రిలీజ్ అయ్యింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్, మురుగదాస్ గత చిత్రాల టీజర్ల మాదిరిగానే ఆసక్తికరంగా రూపొందింది. ముఖ్యంగా కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయే ఏ మాత్రం రివీల్ కాకుంగా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం మహేష్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ పేరుతో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ టీజర్ ను కట్ చేశారు. మహేష్ లుక్ తో పాటు సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ అన్న విషయాన్ని కూడా టీజర్ లో రివీల్ చేశారు. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేష్ లుక్స్, గ్రాఫిక్స్ తో టీజర్ సూపర్బ్ గా ఉంది.

ముందుగా ఈ టీజర్ ను మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయాలని భావించినా.. దర్శకరత్న దాసరి మరణించటంతో వాయిదా వేశారు. ఒక్క రోజు ఆలస్యంగా స్పైడర్ టీజర్ ను రిలీజ్ చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మురుగదాస్ కు బాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ ఉండటంతో స్పైడర్ ను అక్కడ కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు

Tags : , , ,