మెగా, నందమూరి హీరోలతో భారీ మల్టీ స్టారర్…?

టాలీవుడ్ సర్కిల్స్ లో మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తెలుగు తెరమీద మరో భారీ మల్టీ స్టారర్ కు రంగం సిద్ధమవుతుందన్న వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా రెడీ అవుతుండగా, మరో మెగా, నందమూరి మల్టీ స్టారర్ కు రంగం సిద్ధమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అది కూడా ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కావటంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ భారీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనుందట. గతంలో ‘అల్లు అర్జున్’ హీరోగా దేశముదురు, ఇద్దరమ్మాయిలతో.. ‘ఎన్టీఆర్’ హీరోగా ఆంద్రావాలా, టెంపర్ లాంటి సినిమాలను తెరకెక్కించిన పూరి, ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘బన్నీ, ఎన్టీఆర్’ కు కథ కూడా వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇంత భారీ చిత్రాన్ని నిర్మించాడానికి ఏ నిర్మాత ముందుకు వస్తాడో చూడాలి.

Add your comment

Your email address will not be published.