`మిక్చ‌ర్ పొట్లం` మూవీ రివ్యూ 

admin
MP

రిలీజ్‌ తేదీ : 19-05-2017
జోన‌ర్‌ :  కిడ్నాప్ డ్రామా
రేటింగ్ : 2.75 / 5

నటీనటులు : శ్వేతా బసు ప్రసాద్, జయంత్, గీతాంజలి తస్య, భానుచంద‌ర్‌, పోసాని త‌దిత‌రులు
దర్శకత్వం : వి.సతీష్ కుమార్
నిర్మాత : వీరన్న చౌదరి
సంగీతం : కె.మాధవపెద్ది సురేష్

ముందు మాట‌ :

మేటి న‌టుడు  భానుచంద‌ర్ త‌న‌యుడు జ‌యంత్ హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ..వి.సతీష్ కుమార్ దర్శకత్వంలో వీరన్న చౌదరి,లక్ష్మి ప్రసాద్ కలిసి సంయుక్తంగా నిర్మించిన `మిక్షర్ పొట్లం` థియేట‌ర్ల‌లోకి రిలీజైంది.  పూర్తి స్థాయి కామెడీ,  థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్వేతాబసు ప్ర‌ధాన పాత్ర పోషించ‌డం ఓ ఎగ్జ‌యిటింగ్ ఎలిమెంట్‌. ఈ సినిమా ప్రేక్ష‌కాభిమానుల్ని ఏ స్థాయిలో అల‌రించిందో తెలియాలంటే ఈ స‌మీక్ష చ‌ద‌వాల్సిందే.

సింగిల్ లైన్ స్టోరి : 

సువర్ణ సుందరి (శ్వేతాబసు ) ట్రావెల్ బస్సు ఓన‌ర్‌. అమలాపురం నుంచి షిరిడీకి ప‌య‌న‌మ‌వుతుంది ట్రావెల్ బ‌స్సు. ఆ బ‌స్సులో యాత్రికుల‌తో పాటు.. సువర్ణ సుందరి ప్ర‌యాణిస్తుంది. అయితే మార్గం మ‌ధ్య‌లో ఓ పెద్ద ట్విస్టు. బస్సు షిరిడీకి చేరువయ్యే సమయంలో కొంద‌రు దుండ‌గులు యాత్రికుల్ని కిడ్నప్ చేస్తారు. ఇంతకీ ఆ కిడ్నాప్ చేసిందెవ‌రు?  సువ‌ర్ణ సుంద‌రి బస్సునే ఎందుకు కిడ్నాప్ చేశారు? ఆ కిడ్నాప్ వెనుక ఉన్న అస‌లు క‌థేంటి? అన్న‌దే బ్యాలెన్స్ సినిమా. 

ప్ల‌స్ పాయింట్స్‌& పెర్ఫామెన్సెస్‌ : 

రొటీన్ కిడ్నాప్ డ్రామా అనిపిస్తున్నా .. ఈ సినిమాలో గ‌మ్మ‌త్త‌యిన విష‌యాలు లేక‌పోలేదు. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థంలో బస్ జ‌ర్నీలో వ‌చ్చే కామెడీ స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ప్రేమ జంట మధ్య రొమాన్స్, లవ్ సీన్స్ చ‌క్క‌గా మెప్పించాయి. ఇక పోసాని- సుమన్ ల మధ్య పొలిటిక‌ల్ సీన్స్ బెటర్ అనిపించాయి. అలాగే కిడ్నాప్ లో  కామెడీ ప్ల‌స్‌. కమెడియన్స్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆక‌ట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాకి ఇంట‌ర్వెల్ బ్లాక్ లో ఇచ్చిన ట్విస్ట్ ఇంట్రెస్టింగ్. ద్వితీయార్థంలో ఏం జరగబోతోందో అన్న క్యూరియాసిటీ పెంచుతుంది. ఇక న‌ట‌న ప‌రంగా శ్వేత‌బ‌సు పెర్ఫామెన్స్‌, భానుచంద‌ర్, పోసాని న‌ట‌న పెద్ద ప్ల‌స్‌. శ్వేత‌బ‌సు గ్లామ‌ర్‌, న‌క్స‌లైట్ నాయ‌కుడిగా భానుచంద‌ర్ న‌ట‌న ఆక‌ట్టుకున్నాయి. జ‌యంత్ న‌ట‌న ఆక‌ట్టుకున్నా.. యువ‌నటుడిలో మ‌రింత‌గా మెరుగుప‌డే ఛాన్సుంది. గీతాంజ‌లి న‌ట‌న ఫ‌ర్వాలేదు. కృష్ణభగవాన్ , అలీ , జూనియర్ రేలంగి , కంటే వీరన్న చౌదరి కామెడీ టైమింగ్ ఆక‌ట్టుకుంది. సినిమాలో మూడు పాట‌లు, మాధ‌వ‌పెద్ది సంగీతం ప్ల‌స్‌

మైనస్ పాయింట్స్ :

సుదీర్ఘ నిడివి ఈ సినిమాకి కొంత మైన‌స్‌.

సాంకేతిక వర్గం :
 
ప్ర‌థ‌మార్థం లో కామెడీ ప్ల‌స్‌. ఇంటర్వెల్ బ్లాక్ ఇవ్వ‌డంలో ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం బ‌య‌ట‌ప‌డింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఉన్న‌ట్టుండి న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్‌లోకి మ‌ళ్ల‌డం.. కీల‌క మ‌లుపు. థియేట‌ర్లో జ‌నాల మ‌ధ్య‌టెన్షన్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు సతీష్ కుమార్ . కృష్ణభగవాన్ , అలీ , కంటే వీరన్న చౌదరి ల మధ్య ఫన్ జనరేట్ అయ్యేలా చేసాడు . అలాగే శ్వేతాబసు నుండి ఏం కోరుకుంటారో అది అందించి కుర్రాళ్లకు గాలం వేసాడు . కిడ్నాప్ నేపథ్యంలో సెకండాఫ్ బాగానే రక్తికట్టింది అయితే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే మరింతగా స్క్రీన్ ప్లే ని  బెటర్ మెంట్ చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేది ఈ మిక్చర్ పొట్లం . నటీనటుల నుండి , సాంకేతిక నిపుణుల నుండి తనకు రావాల్సిన దాన్ని రాబట్టుకున్నాడు దర్శకుడు. చాలాకాలం తర్వాత మాధవపెద్ది సురేష్ సంగీతం అందించిన సినిమా ఇది . మూడు పాటలు బాగున్నాయి . ఇక ఛాయాగ్రాహకులు కళ్యాణ్ సమీ అందించిన సినిమాటో గ్రఫీ చాలా బాగుంది . నిర్మాణ విలువల ప‌రంగా రాజీకి రాకుండా తెర‌కెక్కించిన చిత్ర‌మిది. 

ముగింపు :  

మిక్చ‌ర్ పొట్లం` టైటిల్‌కి త‌గ్గ‌ట్టే కామెడీ, థ్రిల్ మిక్స్ చేసిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్‌. ప్రేక్ష‌కుల్ని ఏమాత్రం నిరాశ‌ప‌ర‌చ‌ని చ‌క్క‌ని కామెడీ థ్రిల్ల‌ర్ ఇది.

రేటింగ్‌ : 2.75 /5

Tags : , , , , , , , , ,