శివ సీక్వెల్ కు నాగ్ గ్రీన్ సిగ్నెల్!

నాగార్జున‌- వ‌ర్మ కాంబినేష‌న్ లో శివ సీక్వెల్ కు ఆస్కారం ఉందా?  నాగ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన నేప‌థ్యంలో వ‌ర్మ రెడీ అవుతాడంటారా?   ఫుల్ డిటైల్స్ లోకి వెళ్తే..

నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శక‌త్వంలో అప్ప‌ట్లో  తెర‌కెక్కిన `శివ‌` ఓ సంచ‌ల‌నం. 90ల‌లో వ‌చ్చిన ఈ క‌ల్ట్ క్లాసిక్ తెలుగు సినిమాకి ఆ కొంత పంథాని ప‌రిచ‌యం చేసింది. సైకిల్ చైన్ లాగి ప్రత్యర్థిపైకి దూసుకెళ్లడం.. చొక్కా మ‌డ‌తెట్టి ట్రెండ్ సెట్ చేయ‌డం అన్నీ శివ‌తోనే మొద‌ల‌య్యాయి. అందుకే ఆ సినిమాకి సీక్వెల్ వ‌స్తే చూడాల‌ని నేటి యువ‌త‌రం సైతం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

నాగ్ శివ-2 చేయాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నించారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ అది కుద‌ర్లేదు. తాజాగా శివ‌కి సీక్వెల్ చేస్తే అది వ‌ర్మ‌తోనే చేయాల‌ని నాగ వంగ‌వీటి మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో చెప్పారు. మ‌రి వ‌ర్మ ఏమంటాడో చూద్దాం.

Add your comment

Your email address will not be published.