ఆ గుట్టు ర‌ట్టు చేసిన కింగ్! | Nagarjuna Reveals Person Who Leaked Hello Movie Poster | Newsmarg

admin
nagarjuna

సినిమా యూనిట్ ప్ర‌క‌టించ‌క ముందే ఆ మూవీకి సంబంధించిన ఏదైనా లీక్ అయిందంటే ప‌డే ప‌రేషాన్ మామూలుగా ఉండ‌దు.

ఎక్క‌డ నుంచి లీకైంది? ఎలా లీకైంది? అస‌లు త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందోన‌ని యూనిట్ బోలోడు ఆరాలు తీస్తుంది. అలా తీసిన ఒక్కోసారి వాటి ఆధారాలు మాత్రం ఎక్క‌డా దొర‌క‌వు. దీంతో కాస్త బాధ‌ప‌డి వ‌దిలేస్తాం. అయితే ఇలాంటి విష‌యాల‌ను మాత్రం కింగ్ నాగార్జున అస్స‌లు వ‌దిలిపెట్టారు. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో తెలుసుకునే వ‌ర‌కూ నిద్రపోడు. ఇంత‌కీ నాగ్ కు నిద్ర ప‌ట్ట‌కుండా చేసిన ఆ సంఘ‌ట‌న ఏంటి? చెక్ డీటైల్స్!

ఇటీవ‌లే చిన్న కుమారుడు అఖిల్ క‌థానాయ‌కుడిగా విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `హాలో` సినిమాకు సంబంధించిన ఓ పోస్ట‌ర్ లీకైంది. యూనిట్ రిలీజ్ చేయ‌లేదు. నాగార్జున ట్విట్ట‌ర్ లో పెట్ట‌లేదు. అయినా ఎలా బ‌య‌ట‌కొచ్చింద‌ని యూనిట్ అంతా గంద‌రగోళానికి గురైంది. వ‌చ్చిన సెకెన్స్ లో కింగ్ దీనిపై సీక్రెట్ మిష‌న్ ప్లాన్ చేసి ఎలా బ‌య‌ట‌కొచ్చిందో క్ష‌ణాల్లో తెలుసుకున్నారు.

ఆ పోస్ట‌ర్ లీకైంది హాంకాంగ్ నుంచి. అది లీక్ చేసింది డైరెక్ట‌ర్ విక్ర‌మ్ చిన్న నాటి స్నేహితుడు. అస‌లు ఇదంతా ఎలా జరిగింది. విక్ర‌మ్ సినిమాల‌కు సంబంధించిన పోస్ట‌ర్స్ అన్నింటినీ హాంకాంగ్ లో త‌న స్నేహితుడు వ‌ద్దే డిజైన్ చేయిస్తాడు. యానిమేష‌న్ త‌దిత‌ర వ‌ర్క్స్ అన్నీ అక్క‌డే జ‌రుగుతుంటాయ‌ట‌. అయితే పోస్ట‌ర్ వ‌ర్క్ పూర్తికాగానే స‌ర‌ద‌గా విక్ర‌మ్ స్నేహితుడు ఫేస్ బుక్ లో పెట్టాడు. అంతే క్ష‌ణాల్లో సోష‌ల్ మీడియా అంతా ఆపోస్ట‌ర్ వైర‌ల్ అయింది. ఈ విష‌యాన్ని నాగ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలిపారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,