వర్మ సినిమాలో నాగార్జున రోల్ ఇదేనట! | Nagarjuna To Play ‘Cop’ Role In Ram Gopal Varma’s Next Movie

admin
rgv

The duo Akkineni King Nagarjuna and controversial king director Ram Gopal Varma is teaming up after 27 years. And this new film is creating a sensation in Film Nagar circles since the time of the announcement. click on the below video to know more details of Nagarjuna To Play ‘Cop’ Role In Ram Gopal Varma’s Next Movie

దాదాపు 27 ఏళ్ళ క్రితం నాగార్జున రాం గోపాల్ వర్మను పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం శివ ఎంతటి సెన్సేషన్ create చేసిందో అందరికి తెలిసిందే. అప్పట్లో ఆ చిత్రం తెలుగు సినిమా దిశను మార్చిన trendsetterగా నిలిచింది. తర్వాత దాన్నే హిందీలో రీమేక్ చేసి నటించాడు నాగ్, అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గోవిందా గోవింద ఫ్లోప్ కావడం తో మళ్ళి ఆ కాంబో రిపీట్ కాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ ట్రెండ్ సెట్టింగ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోదంటే అది తెలుగు ప్రేక్షకులకు శుభవార్తే.

అన్నిటికంటే ముఖ్యంగా కింగ్ నాగార్జునను ఇన్నేళ్ల తర్వాత వర్మ ఎలా చూపిస్తాడో తెలుసుకోవాలని అక్కినేని అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు.
వాల్ల కోసమే అన్నట్టు వర్మ సినిమలో తాను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నానని, సినిమా ఒక ఇంటెన్స్, స్టైలిష్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉంటుందని ట్వీట్చేసారు నాగార్జున. ఆర్జీవీ స్వీయ నిర్మాణ సంస్థ కంపెనీ లో రూపొందనున్న ఈ సినిమాను నవంబర్ 20 నుండి మొదలుపెట్టనున్నారు. మరి ‘శివ’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ఇద్దరు ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

Tags : , , , , , , , , , , , , , , , , ,