గే – వివాదం:రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై మెగా- నంద‌మూరి ఫ్యాన్స్ ఎటాక్‌ | Nandamuri-Mega Fans Attacks On RGV

admin
rgv

Nandamuri, Mega Fans Attack on the gay issue on Ram Gopal Varma, is currently an intriguing issue. NTR and Charan are the ones who have been punched in a fury for being gay. Are our heros are gay? Fans were assaulted. You’re a genuine gay man. Click on the below video to know more details of Nandamuri-Mega Fans Attacks On RGV

వివాదాల రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై నంద‌మూరి, మెగా ఫ్యాన్స్ ఎటాక్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌ను గే అని అన్నందుకు వ‌ర్మ‌కు ఓ రేంజులోనే పంచ్ ప‌డింది. మా హీరోల్ని గే అంటావా? అంటూ ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. నువ్వే అస‌లైన గే అంటూ తిట్టి పోశారు. నీకు చావు ద‌గ్గ‌ర‌ప‌డింది అంటూ వార్నింగులు ఇచ్చారు. అంతేకాదు.. రామ్ గోపాల్ వ‌ర్మ ఇంటి ఆడ‌వాళ్ల‌ను విన‌కూడ‌ని రీతిలో స‌ద‌రు అభిమానులు బూతులు తిట్ట‌డం సంచ‌ల‌న‌మైంది.

అనునిత్యం ఏదో ఒక వివాదంతో అంట‌కాగ‌నిదే వ‌ర్మ‌కు నిదుర ప‌ట్ట‌దు. మొన్న‌టికి మొన్న `నంది` అవార్డుల‌పై క‌మ్మ‌ని పాట పాడి సెన్సేష‌న్ సృష్టించాడు. కులం ప్రాభ‌వం గురించి ఆర్జీవీ చాలా బాగానే పాడాడు. ఇక‌పోతే… నిన్న‌నే రాజ‌మౌళిని ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ ఆలింగ‌నం చేసుకుని ఉన్న ఫోటోని త‌న అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, దానికి `గే యాక్ట్‌ని బ‌లంగా ఖండిస్తున్నా` అంటూ ఘాటుగా వ్యాఖ్య పెట్టాడు. గే కల్చర్‌ని బాహాటంగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని అన్నాడు.

అంతేకాదు ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించిన వ‌ర్మ ముగ్గురి ఫొటోను షేర్ చేస్తూ వర్మ “ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురూ ఆ టైపేనా. పైగా ముగ్గురూ కూడా వివాహితులే. అల్లా ఏం జరుగుతోంది? జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి.. తిరుపతి వెంకన్న గారు మీరైనా..“ అంటూ ఘాటైన వ్యాఖ్య పెట్టారు వ‌ర్మ‌. అయితే దీనిని సామాన్య జ‌నం లైట్ తీస్కున్నారు కానీ, ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీలైపోయారు. స్వలింగ సంపర్కుల సంస్కృతిని నీ కంటే ఎవరూ బాగా ప్రమోట్ చేయడం లేదు. వారితో పోల్చితే వ‌ర్మా నువ్వే బాగా సరిపోతావు అని తిట్టేశారు.

దీంతో సీరియ‌స్ అయిన‌ రామ్‌చ‌ర‌ణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు వ‌ర్మ‌పై ప్ర‌తిదాడి చేశారు. సామాజిక మాధ్య‌మాల్లో చీల్చి చెండాడారు. త‌మ అభిమాన హీరోల్ని కించ‌ప‌రుస్తూ ఫోటో క్యాప్ష‌న్ పెట్టినందుకు వ‌ర్మ‌పై రివ‌ర్స్ ఎటాక్ చేశారు. ఆర్జీవీ నువ్వే అస‌లు సిస‌లు `గే` అంటూ ప్ర‌తిదాడి చేశారు. పిచ్చి పర్వర్టెటెడ్ సైకో గాడివి అంటూ బుతులే తిట్టారు. అయినా సామాజిక మాధ్య‌మాల్లో స‌ర‌దా ఆట‌లు ఆడే వ‌ర్మ‌తో స‌ద‌రు హీరోల ఫ్యాన్స్ పెట్టుకోవ‌డ‌మేంటో? ఇదంతా ఓ టైమ్‌పాస్ గేమ్ అని స‌రిపెట్టుకోగ‌ల‌మా? బూతులు.. తిట్ల దండ‌కంతో ఇలా ఫ్యాన్స్ చెల‌రేగిపోవ‌డం ఏ క‌ల్చ‌ర్‌కి నాంది? పైగా అంద‌రూ చ‌దివే సామాజిక మాధ్య‌మం మ‌రీ ఇంత బూతు అయిపోవ‌డం, వివాదాల‌కు ఆల‌వాలం అయిపోవ‌డం హ‌ర్షించ‌ద‌గిన ప‌రిణామం కానేకాదు. మ‌రి దీనిపై మీ వ్యూ ఏంటో?

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,