సిగ్గుపడితే హిట్టా? | Nani MCA Movie Teaser Review | Middle Class Abbayi | Sai Pallavi

admin
nani mca

As we all know natural star Nani is currently busy with the shoot of ‘Middle Class Abbayi’ after the success of ‘Ninnu Kori.’ The film directed by Sriram Venu has been creating a lot of buzz in Tollywood ever since it went on floors. Click on the below video to know more details of Nani MCA Movie Teaser Review | Middle Class Abbayi | Sai Pallavi

‘ఎంసీఏ’టీజర్‌తో నేచురల్ స్టార్ నాని వచ్చేశాడు. నాని-సాయిపల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న లవ్ ఎంటర్టైనర్ మూవీ ‘ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయ్’ టీజర్‌ను ముందుగా ప్రకటించినట్టే శుక్రవారం ఉదయం విడుదల ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు హీరో నాని.

ఎంసీఏ అంటే క్వాలిఫికేషన్ కాదని.. అదో మైండ్ సెట్ అంటూ కొత్త అర్థం చెప్తూ గిలిగింతలు పెడుతున్నాడు మిడిల్ క్లాస్ అబ్బాయ్. ఎప్పుడైనా షర్ట్ బటన్ ఊడిపోతే పిన్నీస్ పెట్టి మేనేజ్ చేశావా? మామూలు జీన్స్‌ను బ్లేడ్‌తో కట్ చేసి టోన్ జీన్స్‌లా కలరింగ్ ఇచ్చావా? అంతెందుకు ఎప్పుడైనా అలా రోడ్ మీదు వెళ్తూ అందమైన అమ్మాయిని చూసి ఇద్దరు ముగ్గురు పిల్లలతో ఫ్యామిలీ ఫోటోను ఊహించుకున్నావా? ఇవన్నీ చేసేవాడే మిడిల్ క్లాస్ అబ్బాయ్ అంటూ నాని అంటుంటే.. నువ్ నాకు బాగా నచ్చేశావ్ ఎప్పుడు పెళ్లిచేసుకుందాం అంటూ ఫిదా పోరి సాయి పల్లవి పువ్వు ఇచ్చి పెళ్లికి ప్రపోజ్ చేయడం ప్రేక్షకులను మరోసారి ఫుల్ ఫిదా చేయడం పక్కా అంటూ అంటూ టీజర్‌తో తేల్చేసింది.

ఇక టీజర్ క్లైమాక్స్‌లో రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ‘మేం.. మిడిల్ క్లాస్ అబ్బాయిలం’ అంటూ దరువు అందుకోవడం టీజర్‌కి అదనపు ఆకర్షణగా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,