నంది అవార్డుల పై బాలయ్య కూతురు బ్రాహ్మణి సమాధానం ఇదీ | Nara Brahmani About Nandi Awards Contraversy

admin
nara brahmani

Brahmani was talking about NTR Memorial’s initiative to collaborate NTR’s Blood Bank with the Facebook and launch Facebook Blood Donation Tool under the programme ‘Facebook for the social good’. Click on the below video to know more details of Nara Brahmani About Nandi Awards Contraversy

ఏపీ ప్రభుత్వం నిర్వహించిన నంది అవార్డుల అనేక వివాదాలకు తెరలేపింది అన్న సంగతి మనకు తెలుసు. కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి ఎక్కువ వచ్చాయని ఒకరు విమర్శిస్తుంటే…… మరొకరు విలువలు కలిగిన సినిమాలకు అవార్డు రాకుండా లెజెండ్ మూవీకి ఇవ్వడం సరికాదు అని విరుచుకుపడ్డారు. నంది అవార్డుల కమిటీల సభ్యులుపై కొందరు సినీ ప్రముఖులు తీవ్రంగా విమర్శించారు. బాలకృష్ణ అండ చూసుకుని కమిటీలు ఇలా చేశాయని విరుచుకుపడ్డారు. ఈ నంది అవార్డులు గతంలో ఎన్నడూ జరగనంతగా అనేక వివాదాలు రగిల్చింది. ఇండస్ట్రీ లోనే ఇలా ఉంటే సోషల్ మీడియాలో జరుగుతున్న హడావిడి ఇంతా అంతా కాదు. నంది అవార్డుల వ్యవహారంపై వెటకారమైన వ్యాఖ్యలు కామెంట్లు నెటిజన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిర కార్యక్రమంలో నటుడు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి మరియు మరో నటుడు అయిన జగపతిబాబు పాల్గొన్నారు.

అంతేకాకుండా బాలకృష్ణ తన రక్తం ఇచ్చారు ఈ శిబిరం లో. రక్త దాన కార్యక్రమం ముగియగానే బ్రహ్మిని మీడియాతో మాట్లాడుతూ తన తండ్రికి నంది అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. నంది అవార్డుల వివాదాల గురించి మీడియా ప్రశ్నించగా ఇది మాట్లాడే సమయం కాదని సున్నితంగా తిరస్కరించారు బ్రాహ్మిణి . కూతురు జవాబుకి తండ్రి బాలయ్య విబినంగా స్పందించారు.లెజెండ్ సినిమాకి అవార్డులు రావడం చాలా సంతోషం అని,లెజెండ్ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడే చాలా వివాదాలు అయ్యాయని చెప్పారు. లెజెండ్ సినిమా కి ఎన్ని అవార్డులు రావడం వెనుక ఎంతోమంది కష్టం ఉందని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.కొన్ని చిత్రాలకు నంది అవార్డులు రావటం లేదన్న వివాదంపై ప్రశ్నించగా.. దానికి బదులు ఇవ్వకుండా వెళ్లిపోయారు బాలయ్య. జగపతిబాబు స్పందిస్తూ లెజెండ్ సినిమాలో పనిచేయడం ఆనందాన్నిచ్చిందని ఉత్తమ విలన్ గా అవార్డు రావడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.కానీ ప్రతి ఒక్కరు తమ ఆనందాన్ని చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఎవరు వివాదాల గురించి మాట్లాడట్లేదు.

Tags : , , , , , , , , , , , , , , , ,