బాలకృష్ణ ముద్దా? చ‌ల‌ప‌తి చేదా? సోష‌ల్ మీడియాలో కొత్త చ‌ర్చ‌!!

mohanrao
balayya

చ‌ల‌ప‌తిరావు స్త్రీల‌పై అగ్లీ కామెంట్స్ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో కొత్త చ‌ర్చ‌కు తెర లేచింది. అప్పుడు బాల‌కృష్ణ కామెంట్ చేసిన‌ప్పుడు మీడియా; మ‌హిళా సంఘాలు ఇలాగే చేశాయా?

చిన్న చిత‌కా న‌టులు చేసే కామెంట్స్‌కు భారీ స్ధాయిలో ఫోక‌స్ ఇచ్చే రెండు ప్ర‌ముఖ ఛాన‌ల్స్‌. పెద్ద హీరో నే కాక ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న వ్య‌క్తులు చేసిన హాట్ అండ్ అంగ్లీ కామెంట్స్ పై ఎందుకు ఈ స్ధాయిలో చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌లేదు? అలాగే మ‌హిళా సంఘాలు అప్పుడు ఏం చేశాయి. ఈ చిన్న స్ధాయి న‌టులుపై తీవ్ర స్ధాయిలో స్పందించారు మంచిదే? అప్పుడు ఇదే తీరులో స్పందించ‌లేదెందుకు? కానీ అప్పుడు కూడా స్పందించి ఉంటే మ‌హిళ సంఘాలు అంద‌రి ప‌ట్ల ఒకే రీతితో స్పందించాయ‌నే భావ‌న క‌ల్గించిన వాళ్లు అయ్యే వారు క‌దా? ఇప్పుడున్నంత స్పీడ్ అప్పుడు ఎందుకు లేదు? స‌్పీడ్ లేక‌పోయినా కానీ ఆ త‌ర్వాత కూడా ఎందుకు స్పందించ లేదంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్న‌ల వ‌ర్షంతో చ‌ర్చ మొద‌లైంది? గ‌తంలో మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తూ ఎవ‌రు మాట్లాడారు. ఏం జ‌రిగిందో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వార్త చదవాల్సిందే.
సీనియర్ నటుడు చ‌ల‌ప‌తిరావు ‘రారండో వేడుక చేసుకుందా’ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌లో స్త్రీలను అవమానించే రీతిలో ముందు వెనుక ఆలోచించ‌కుండా మాట్లాడేశారు. ఈ చిత్రం ఆడియో ఫంక్ష‌న్‌కు యాంక‌రింగ్ చేస్తున్న లేడీ యాంక‌ర్ ఈ చిత్రంలో అమ్మాయిలు మ‌న‌సు శాంతికి హానిక‌ర‌మా? అంద‌రి అభిప్రాయాలు అడుగుతూనే ముందు వ‌ర‌స‌లో కూర్చున్న చ‌ల‌ప‌తిరావు అభిప్రాయం కూడా కోరింది. దాంతో చ‌ల‌ప‌తిరావు ముందు వెనుక ఆలోచించ‌కుండా అమ్మాయిలు మ‌న‌సు శాంతికి హానిక‌రం కాదు గానీ ప‌క్క‌లోకి ప‌నికొస్తార‌నే అగ్లీ కామెంట్ చేశారు. ఆయ‌న కామెంట్‌తో అవాక్కైన లేడీ యాంక‌ర్ వెను తిర‌గ్గా, మ‌రో యాంక‌ర్‌గా ఉన్న ర‌వి మాత్రం ఆయ‌నేదో గొప్ప‌గా మాట్లాడిన‌ట్లుగా ఆయ‌న్ని అభినించేశాడు. దీంతో మ‌హిళ‌ల‌కు మండింది. చ‌ల‌ప‌తిరావు వ‌య‌సు పెరిగినా బుద్ది పెర‌గ‌లేద‌ని అనేక మంది దుమ్మెత్తిపోశారు. చాలా మంది మొఖం ప‌ట్టుకుని తిట్టారు. కొన్ని మ‌హిళా సంఘాలు చ‌ల‌ప‌తిరావుపై బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాల‌ని ఫిర్యాదు చేశారు. దీంతో నాలుక్కుర‌సుకున్న చ‌ల‌ప‌తిరావు దిగొచ్చారు. కాళ్ల బేరానికి వ‌చ్చారు. తాను చేసిన వ్యాఖ్య‌లు త‌న‌కే వెగ‌టు పుట్టిస్తున్నాయ‌ని. తాను అన్న మాట‌ల‌కు త‌న‌ను క్ష‌మించాల‌ని బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పేశారు. దాంతో చ‌ల‌ప‌తిరావు స‌మ‌స్య స‌ద్దుమ‌ణికింద‌ని అనుకుంటున్న త‌రుణంలో సోష‌ల్ మీడియాలో మ‌రో కోణంలో చ‌ర్చ‌కు తెర లేపారు. ఇటువంటి అగ్లీ కామెంట్స్ చేస్తున్న వారి ప‌ట్ల మీడియాగానీ, మ‌హిళా సంఘాలు కానీ వ్య‌వ‌హ‌రిస్తున్నాయా? బాధ్య‌తాయుతమైన ప‌ద‌విలో కొన‌సాగుతున్న ప్ర‌జాప‌తినిధి అయి ఉండి ప్ర‌ముఖ హీరోగా ఉన్న బాల‌కృష్ణ ఇటువంటి కామెంట్స్ చేస్తే ఏం చేశారు. ?అప్పుడు మీడియా ఎందుకు టీవీల్లో డిబేట్ చేయ‌లేదు? ఇప్పుడు ఇంత‌గా రెచ్చిపోయిన మ‌హిళా సంఘాలు ఆనాడు ఎందుకు స్పందించ‌లేదూ అంటూ చ‌ర్చ‌ను లేవ దీశారు.
ఇంత‌కీ బాల‌కృష్ణ గ‌తంలో ఏం అన్నారు?

బాల‌కృష్ణ ఓ ఆడియో ఫంక్ష‌న్‌లో మాట్లాడుతూ.. అమ్మాయిలు వెంట ప‌డితే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు.. కానీ అమ్మాయిల‌కు క‌డుపైనా చేయాలి లేదా ముద్దైనా పెట్టాలి. వాళ్ల‌ను క‌మెంట్ చేయించాలంటూ ఆ ఫంక్ష‌న్ లో చేసిన కామెంట్ పై కొంద‌రు బాల‌కృష్ణ‌ను నిల‌దీశారు. ఆనాడే కొంత ర‌చ్చ కూడా జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యే రోజా దీనిపై బాల‌కృష్ణ‌ను విమ‌ర్శించారు. దాంతో బాల‌కృష్ణ కూడా విచారం వ్య‌క్తం చేశారు. దాంతో ఈ వివాదం అక్క‌డితో స‌మ‌చిపోయింది. ఒక్క బాల‌కృష్ణే కాదు ఇంకొంద‌రు కూడా మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రుస్తూ ప‌రుషంగా మాట్లాడారు. ఈ కోవ‌లో క‌మెడియ‌న్ అలీ అనుష్క‌ను జిలాబీలా తినేయాల‌న్పిస్తుందంటూ కామెంట్ చేశారు. అలాగే హీరో నాని కూడా ఇక్క‌డ ఇంత కంటే మాట్లాడ‌లేనంటూ ధ్వంద అర్ధాలు ధ్వ‌నించే విధంగా కామెంట్ చేశారు. కానీ చ‌ల‌ప‌తిరావు కామెంట్స్‌లో మ‌రో సారి మ‌హిళ‌ల‌ను చుల‌క చేస్తూ మాట్లాడుతున్న వారి ప‌ట్ల మీడియా కానీ, మ‌హిళ సంఘాలు కానీ స్పందిస్తున్న తీరుపైనే చ‌ర్చ మొద‌లైంది. కొన్ని ఛాన‌ల్స్ మాత్రం చిన్న‌, చిత‌కా న‌టుల ప‌ట్ల ఒక రీతిలోనూ. పెద్ద హీరోల ప‌ట్ల మ‌రో రీతిలోనూ స్పందిస్తున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో ఏబీఎన్‌, టీవీ నైన్ ఛాన‌ల్స్‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్ర‌జాల ఆధ‌ర‌ణ‌తో ఆడంబ‌రాలు అనుభ‌విస్తున్న హీరోలు స‌మాజం ప‌ట్లు, స్త్రీల ప‌ట్ల క‌నీస బాధ్య‌త‌ను విస్మ‌రించి ఈ విధ‌మైన కామెంట్స్ చేయ‌టం చేయ‌టం ప‌ట్లే అభ్యంత‌రం వ్య‌క్తం అవుతుంది. ఇప్ప‌టికైనా ఇటువంటి వారు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఆశిద్దాం.

Tags : , , , , , , , , , ,