నెక్స్ట్ సూరితోనే మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ద‌ర్శ‌కుడు దాదాపు కన్ఫ‌మ్ అయిన‌ట్లే… ఆ స్టార్ డైరెక్ట‌ర్ల ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి మ‌రో ద‌ర్శ‌కుడి దూరి ఛాన్స్ త‌న్నుకుపోయాడు.. ఎవ‌రా డైరెక్ట‌ర్?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా త‌ర్వాత 151వ‌గా ఏ మూవీ చేస్తాడు..ఏ ద‌ర్శ‌కుడితో చేస్తాడ‌ని మెగా అభిమానుల్లో ఇప్ప‌టికే ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికే డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ల పేర్లు బ‌లంగా వినిపించాయి. ఆ ఛాన్స్ వీళ్లిద్ద‌రిలో ఎవ‌రిదో ఒక‌రిది అవుతుంద‌ని అంతా భావిస్తున్నారు.

అయితే ఆ ఛాన్స్ ఇప్పుడు స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి త‌న్నుకుపోయాడు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు ధృవ‌తో భారీ స‌క్సెస్ మూవీ అందించాడు. చెర్రీ ని డిఫ‌రెంట్ వేలో ప్ర‌జెంట్ చేసి బాస్ తో మార్కులు కొట్టేసాడు. అందుకే 151వ సినిమా ఛాన్స్ సూరికే ఇవ్వాల‌ని బాస్ బ‌లంగా ఫిక్స్ అయ్యార‌ట‌. అయితే సూరి బాస్ ను తెర‌పై ఎలాంటి క‌థ‌తో చూపిస్తాడన్న‌ది ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్.

Add your comment

Your email address will not be published.