నితిన్ సినిమా అలా ఆగిపోయింది!

ఆ ఒక్క బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత ఏకంగా పారితోషికం పెంచేశాడు నితిన్‌. దాంతో ఓ క్రేజీ ప్రాజెక్టును వ‌దులుకోవాల్సొచ్చింది.

‘అ.. ఆ’ సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న నితిన్ ఆ త‌ర్వాత అనూహ్యంగా పారితోషికం పెంచేశాడు. అప్ప‌టి వ‌ర‌కూ  నాలుగు కోట్లు అందుకుంటున్న నితిన్ ఒక్క‌సారిగా రేంజు మారిపోయిందంటూ ఐదు కోట్ల‌కు పెంచేశాడు. అయితే ఇదే పాయింటు ఓ నిర్మాత‌కు న‌చ్చ‌లేదు. పారితోషికం పెంచేయ‌డం న‌చ్చ‌క ఏకంగా ప్రాజెక్టును ఆపేశారు. 

వాస్త‌వానికి ‘అ…ఆ’ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో అనీల్ సుంక‌ర నిర్మాత‌గా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమాకి అంగీక‌రించాడు నితిన్‌. కానీ కోటి అద‌న‌పు పారితోషికం ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని నిర్మాత తేల్చి చెప్పేశారు. దాంతో ఆ ప్రాజెక్టుకు నితిన్ ‘నో’ చెప్పేశారు. ఆ వెంటనే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ నిర్మాత‌లుగా కొత్త సినిమాకి ఓకే చెప్పేశాడు. ఇటీవ‌లే ఈ  సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగతి తెలిసిందే. కేవ‌లం ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 

Add your comment

Your email address will not be published.