పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎన్టీఆర్ వివ‌ర‌ణ‌

admin
JrNTR

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే బహిరంగంగా ప్రకటిస్తానే కానీ, రాత్రికి రాత్రి ప్రకటన చేసే అవసరం నాకు లేద‌ని చెప్పారు ఎన్టీఆర్‌.

జూనియర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్‌ ఎంట్రీపై ప‌రిశ్ర‌మ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తార‌క్ `నవ భారత్ నేషనల్ పార్టీ` పేరుతో ఓ రాజకీయ పార్టీ పెట్టారనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ పార్టీ పేరును రిజిస్టర్ చేయించిన కొందరు వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ అధ్య‌క్షుడిగా.. అంటూ స‌స్పెన్స్ క్రియేట్ చేస్తూ ఓ లేఖ‌ను సృష్టించారు. అయితే ఈ లేఖ చ‌దివినవారంతా ఖంగు తిన్నారు. అవునా … నిజంగానా? ఎన్టీఆర్ సైలెంటుగా వ‌స్తున్నారా? అంటూ ఒక‌టే క‌ల‌క‌లం రేగింది. క‌ట్ చేస్తే ఈ లెట‌ర్‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ప్రజలకు మంచి చేయాలంటే దానికి మార్గం రాజకీయాలు మాత్రమే కాదు. అయినా నేను పార్టీ పెడుతున్నట్లు వినిపించిన‌ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

గాలి వార్త‌ల్ని న‌మ్మొద్ద‌ని ఫ్యాన్స్‌కి విన్న‌వించాడు. ప్ర‌స్తుతం దృష్టంతా సినిమాల‌పైనే ఉంద‌ని తెలియ‌జేసాడు. భ‌విష్య‌త్‌లో పొలిటిక‌ల్ ఆలోచ‌న‌లు వ‌స్తే త‌ప్ప‌కుండా అభిమానుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పాడు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉంటే బహిరంగంగా ప్రకటిస్తానే కానీ, రాత్రికి రాత్రి ప్రకటన చేసే అవసరం నాకు లేద‌ని చెప్పాడు ఎన్టీఆర్‌. దీన్నిబ‌ట్టి తార‌క్ ఓవ‌ర్‌నైట్ పొలిటిక‌ల్ స్టార్ కాద‌లుచుకోలేద‌ని అర్థం చేసుకోవాలి.

Tags : , , , , , , , , ,