నంబ‌ర్ -1 సూప‌ర్‌హీరో ఓ లేడీ అంటే న‌మ్మ‌గ‌ల‌రా? | Number-1 Super Hero | Wonder Woman

admin
wonder woman

Woman . Number-1 Super Hero wonder woman . Telugu Stars . Can we believe a number 1 superhero is a lady ?! But believe it. So far, the number of superhero films in the world has seen a number of superhero films featuring a lady as the number one. This is true.Click on the below video to know more details of Number-1 Super Hero | Wonder Woman

నంబ‌ర్ -1 సూప‌ర్‌హీరో ఓ లేడీ అంటే న‌మ్మ‌గ‌ల‌రా?! కానీ న‌మ్మి తీరాలి. ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన సూప‌ర్ హీరో సినిమాల్లో నంబ‌ర్ సినిమాగా ఓ లేడీ న‌టించిన సూప‌ర్ హీరో సినిమా రికార్డుల కెక్కింది. ఇది ప‌క్కా నిజం.
డీటెయిల్స్‌లోకి వెళ‌దామా?

హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `వండ‌ర్ ఉమెన్` 2017 సినిమాల్లోనే ది బెస్ట్ హిట్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. గాల్ గాడోట్ టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్‌లు బ‌ద్ధ‌లుగొడుతూ సంచ‌ల‌న వ‌సూళ్లు సాధించింది. లేడీ సూప‌ర్ ఉమెన్ క్యారెక్ట‌ర్‌తో మ‌రో లేడీ తెర‌కెక్కించిన సెన్సేష‌న‌ల్ మూవీగా ఈ చిత్రం ప్ర‌పంచ సినీవిమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ క్రేజీ సినిమా మ‌రో అరుదైన రికార్డును అందుకుంది. ప్ర‌పంచంలోనే టాప్ -50 సూప‌ర్‌హీరోస్ సినిమాల లిస్ట్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానం అందుకుంది. ఎక్స్‌మెన్ సిరీస్ సినిమాల్నే త‌ల‌ద‌న్నుతూ టాప్ 50లో టాప్ -1 గా నిల‌వ‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

`50 బెస్ట్ సూప‌ర్‌హీరో మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్` పేరుతో ప్ర‌ఖ్యాత రోటెన్ టొమాటోస్ నిర్వ‌హించిన స‌ర్వేలో నంబ‌ర్ -1 చిత్రంగా `వండ‌ర్ ఉమెన్‌` స్థానం ద‌క్కించుకుంది. 108.69 శాతం రేటింగ్‌తో `వండ‌ర్ ఉమెన్‌` టాప్‌-1లో నిలిచింది. ఆ త‌ర్వాత హూజ్ జాక్‌మ‌న్ న‌టించిన `లోగ‌న్‌-వోల్వ‌రిన్‌` 108.04 రేటింగ్‌తో సెకండ్ పొజిష‌న్‌కి ప‌రిమిత‌మైంది. థోర్‌-రంగ్‌రాక్ 106.6 పాయింట్ల‌తో మూడో స్థానంలో, ది ఇంక్రెడిబుల్స్ (2004) 103.5 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో, ది లెగో బ్యాట్‌మేన్ (2017) చిత్రం 103.2 పాయింట్ల‌తో ఐదో స్థానంలో నిలిచాయి. ఈ సినిమాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద‌క్కిన ఆద‌ర‌ణ‌, వ‌చ్చిన స‌మీక్ష‌లు స‌హా ఆన్‌లైన్ ఆద‌ర‌ణ వంటి విష‌యాల్ని సేక‌రించ‌డం ద్వారా ఈ స‌ర్వేని రోటెన్ టోమాటోస్ పూర్తి చేసింది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,