శింబుపై 100 కంప్లైంట్లు.. ఏంటో తెలిస్తే షాకే! | OMG! 100 Complains Filed Against Hero Simbu

admin
simbu

Producer Michael Rayappan and director Adhik Ravichandran, at a quickly convened press meet last evening, denounced actor Silambarasan for the losses they incurred due to the failure of Anbanavan, Asaradhavan, Adangadhavan, which released earlier this year.Click on the below video to know more details of OMG! 100 Complains Filed Against Hero Simbu

హీరోకి- నిర్మాత‌కి మ‌ధ్య సింక‌వ్వ‌క‌పోతే చినికి చాటైపోతుంది అన‌డానికి ఇదిగో ఇదే అస‌లుసిస‌లైన ఉదాహ‌ర‌ణ‌. ఓ హీరోకి, నిర్మాత‌కు గొడ‌వ జ‌రిగాక .. ఆ ప్రాజెక్ట్ ముందుకెళితే జ‌రిగే న‌ష్టం అనంతం అన‌డానికి ఇదిగిదిగో అదిరిపోయే ఎగ్జాంపుల్‌. శింబు న‌టించిన `అన్బనవన్‌ అసరధవన్‌ అదంగధవన్‌` (ఏఏఏ) ఇప్ప‌టికే త‌మిళంలో రిలీజై డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా వైఫ‌ల్యానికి కార‌ణాలేంటో నిర్మాత ఎస్‌.మైఖేల్‌ రాయప్పన్ ఆవేద‌న‌గా చెప్పుకొచ్చారు. శింబు వ‌ల్ల తాను పడిన కష్టాలను మరే నిర్మాత పడకూడదదంటూ … 100 పైగా కంప్లైంట్లు ఇచ్చారు. అవి ఆయన మాట్లాల్లోనే..

*500 సినిమాల నిర్మాత‌ను నేను. శింబుతో `అంబనవన్‌ అసరధవన్‌ అండంగధవన్‌`(ఏఏఏ) నిర్మించ‌డం ఓ పీడకల. శింబు పంప‌డం వ‌ల్ల ఆదిక్ చెప్పిన క‌థ విని ఓకే చేశాను. శింబు ఈ చిత్రంలో త్రిపాత్రాభిన‌యం చేయాల్సి ఉంది. అయితే ఆ త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌లైంది. అంత‌గా శింబు ఏం చేశాడో మీరు తెలుసుకుని తీరాలి.

*అస‌లు శింబు పేరు విన‌గానే క‌థానాయికలే దొర‌క‌లేదు. మొద‌ట త్రిష‌ను ఎంపిక చేసి అడ్వాన్స్‌ కూడా ఇచ్చాం. త‌ను చివరకు నటించనని చెప్పి అడ్వాన్సు తిరిగి ఇచ్చేశారు. త‌ర్వాత‌ లక్ష్మీ మేనన్ ఆఫ‌ర్‌ని తిరస్కరించింది. చివరకు శ్రియా ఓకే అయ్యింది.

*షూటింగుల్లో శింబు జోక్యం అపారం. తరచూ షూటింగ్‌ లొకేషన్స్ మార్చ‌మ‌ని విసిగించేవాడు. వేడిగా ఉంద‌ని, వాతావ‌ర‌ణం బాలేద‌ని కొంటె సాకులు చెప్పేవాడు. మైసూర్‌, గోవా, కోచి .. లొకేష‌న్స్‌ మారుతూనే ఉండేవి. అలా నెలలు గడిచిపోయేవి. దిండిగ‌ల్‌లో స్టార్‌ హోటల్‌ లేదని, పబ్లిక్‌ ప్రాంతంలో షూటింగ్‌కి రానని శింబు ఓసారి చెప్పాడు. జనాలు ఎక్కువగా ఉంటే అక్క‌డ షూట్స్‌ ఆపేయాలని కూడా హెచ్చరించాడు. ఆదివారాలు సెలవు మ‌స్ట్ అనేవాడు. ఇన్ని అడ్డంకుల్లో చిత్రీక‌ర‌ణ సాగింది.

*కాల్షీట్ నిర్ణ‌యించేది అత‌డే. కాల్షీట్‌ ప్రకారం ఒక్కరోజూ షూటింగ్‌ స్పాట్‌కు రాలేదు. తొలి షెడ్యూల్‌ తర్వాత ఆక‌శ్మికంగా మరో బాంబు పేల్చాడు. శ్రియను సినిమా నుంచి తప్పించి, వేరొక హీరోయిన్‌ని తీసుకోవాలిట‌. ఇప్పటి వరకూ తీసిన మొత్తాన్ని రీషూట్‌ చేయమన్నాడు. దీంతో సాంగ్ షూట్ పెండింగ్‌లో ప‌డింది.

*రెండో షెడ్యూల్ దుబాయ్ లో చేయాల్సింది. అయితే అక్కడ వేడి ఎక్కువగా ఉంటుందని, లొకేషన్‌ లండన్‌కు మార్చాలని కోరాడు.చివ‌ర‌కు ఏదోలా ఒప్పించాం.

*ఓసారి బరువు తగ్గిన తర్వాత షూటింగ్‌కు వస్తానని చెప్పాడు. అయితే క‌స‌ర‌త్తులు నిల్‌.

*ప్రొథెస్టిక్‌ మేకప్ గంట‌లు ప‌డుతుందని మేకప్ వ‌ద్ద‌నేవాడు. అదేమంటే అవసరమైతే సీజీలో మేనేజ్‌ చేసుకోమని ఉచిత సలహా ఇచ్చేవాడు. కొన్నిరోజులు షూటింగ్‌కు వచ్చేవాడు కాదు. అతని వల్లే చాలా రోజులు షూటింగ్‌ను రద్దు చేయాల్సి వచ్చేది.
*ఓ హోట‌ల్ బిల్ విష‌యంలో కోస్టార్ సుబ్బులో గొడ‌వ‌ప‌డి, అత‌డిని సినిమా నుంచి త‌ప్పించేయ‌మ‌ని కోరాడు. త‌ప్పించాల్సొచ్చింది. శింబు కారణంగా తమన్నా, కోవై సరళ, మొత్త రాజేంద్రన్‌, నీలు .. అంతా ఇబ్బందుల పాల‌య్యారు.

*దుబాయ్ అంటే సింగ‌పూర్ అంటాడు. సింగ‌పూర్ అంటే థాయ్‌ల్యాండ్ అంటాడు. బ‌రువు త‌గ్గేందుకే 3నెలల టైమ్ కావాల‌నేవాడు. పోనీ త‌గ్గుతాడా అంటే అదీ లేదు. ఇక విదేశీ విహారాల పేరుతో ఎక్కువ‌గా ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తూ గడిపేవాడు. అదీ నా డబ్బులతో.

*ఓసారి.. నేను కంగారుగా ఉన్న‌పుడు.. త‌ను ఓ మాట‌న్నాడు. సినిమా బాగా వస్తోందని, రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అంతేకాదు ఒక్క పైసా కూడా తీసుకోకుండా రెండో భాగంలో తాను నటిస్తానని చెప్పాడు. అందుకు అంగీకరించాలని నన్ను కోరగా, నాకు ఇష్టం లేదని చెప్పాను. ఆ క్ర‌మంలో చాలా ఇబ్బందులు పెట్టాడు. బ‌తిమాలినా సినిమా పూర్తి చేయ‌డానికి ఏడాదిన్న‌ర ప‌డుతుంద‌ని నానా ఇబ్బంది పెట్టాడు.

*జూన్‌ 23న సినిమా విడుదలకు సిద్ధం చేయాలనుకున్నాం. అప్ప‌టికి ఒక పాట బ్యాలెన్స్. తాను కోరిన‌ట్టే త‌న ఇంట్లోనే షూటింగ్ చేశాం. త‌న ఇంట్లో షూటింగుకే తెల్లారాక 3గంట‌ల‌కు వ‌చ్చాడు. ఇలాంటి ఘోరం ఇంకేమైనా ఉంటుందా? ఆ త‌ర్వాత డ‌బ్బింగులోనూ ఇంతే. సెన్సార్ ఇంకో ఐదురోజుల‌న‌గా.. తన ఇంటిలో బూత్‌రూంలో వాయిస్‌ రికార్డు చేసి మాకు పంపాడు. ఆ ఆడియో క్వాలిటీ లైట్‌.. సౌండ్‌ మిక్సింగ్‌ కుదరడం లేదని ఎడిట‌ర్ చెప్పారు. సెన్సార్‌కు కేవలం ఐదు రోజుల ముందు ఇది జరిగింది. చివరకు వాయిస్‌ మాడ్యులేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో క్వాలిటీ పెంచి ఆ తంతును ముగించాం. చివ‌రికి సినిమా ఏదోలా రిలీజై అట్ట‌ర్‌ఫ్లాపైంది. ఇలాంటి క‌ష్టాలు ఏ నిర్మాత‌కు హీరో వ‌ల్ల రాకూడ‌ద‌నే ఈ లేఖ రాశాను.. అంటూ త‌న వ్య‌థ‌ను వినిపించారు స‌ద‌రు నిర్మాత‌.

ఈ మొత్తం ఎపిసోడ్స్‌లో నీతి ఏమి? అంటే అసలు హీరోతో చెడితే సెట్స్‌కెళ్ల‌డ‌మే రాంగ్‌. అలా వెళ్లాక దానిని కొన‌సాగించ‌డం ఇంకా ఇంకా పెద్ద రాంగ్‌. కోట్ల‌కు కోట్లు జేబుల‌కు చిల్లు పెట్టించుకునే తెలివిత‌క్కువ‌త‌నం అని డిక్లేర్ చేయాల్సిందే. మీరైతే ఏమంటారు?

Tags : , , , , , , , , , , , , , , , , , , ,