అప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనిపించింది | Once ileana was thinking of suicide In Depression

admin
ileana

Actress Ileana D’Cruz, who had opened up about her struggle with Body Dysmorphic Disorder, revealed that at one point of time she had “suicidal thoughts and wanted to end things.” Click on the below video to know more details of Once ileana was thinking of suicide In Depression .

గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు బాలీవుడ్ లో తెగ వెలిగిపోతోంది. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవించి.. బాలీవుడ్ వెళ్లాక ఈమె కెరీర్ లో కొన్ని మాంచి హిట్స్ తో పాటు.. మంచి యాక్ట్రెస్ అని కూడా గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల్లోనూ.. ఫోటో షూట్స్ లోనూ ఈమె కళ్లలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అయితే.. ఈ భామ ఇప్పుడీ స్థాయిలో ఉంది కానీ.. గతంలో ఆత్మహత్య ఆలోచనలు కూడా చేసిందట.

తన జీవితాన్ని అంతం చేసుకోవాలని కూడా భావించినట్లు చెబుతోంది ఇల్లీ. అయితే.. దీనికి కారణం ఏంటనేది మొదట్లో తనకు తెలియదని.. బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ కారణంగా.. అంటే తన శరీరంపై తనకు ఉన్న ఆలోచనల కారణంగానే ఇలా చేసినట్లు తర్వాత తెలిసిందని చెప్పింది. ఒకసారి ఈ విషయం అర్ధమైన తర్వాత.. ఏ మాత్రం ఆలోచించకుండా.. డిప్రెషన్ కు ట్రీట్మెంట్ తీసుకున్నానని.. తను ఎలా ఉందో అలాగే స్వీకరించాలనే విషయాన్ని తెలుసుకున్నానని అంటోంది ఇల్లీ.

డిప్రెషన్ ఉన్నపుడు తీరుబాటుగా కూర్చుంటే సరిపోదని.. మెదడులో కెమికల్ బ్యాలెన్స్ సరిగా లేనపుడే ఇలాంటి పరిస్థితి వస్తుందన్న గోవా బ్యూటీ.. డిప్రెషన్ ఉన్నపుడు కచ్చితంగా సహాయం తీసుకోవాలని చెబుతోంది. తనకు తన తల్లి ఈ విషయంలో చేసిన సాయం ఎన్నటికీ మరిచిపోలేనని అంటోంది ఇలియానా.

Tags : , , , , , , , , , , , , , , ,