మృత్యువును జ‌యించు.. ప‌ద్మావ‌తి క‌న్నీళ్ల అర్థం! | Padmavathi | Ek Dil Ek Jaan Song

admin
padmavathi

The makers of the much talked about period drama ‘Padmavati‘ have released a new song by the name ‘Ek Dil Ek Jaan’. This song is a tremendously melodious tune which features Rani Padmini and Maharawal Ratan Singh. Click On the belw video to know more details of Padmavathi | Ek Dil Ek Jaan Song

ఎన్నో వివాదాల న‌డుమ ప‌ద్మావ‌తిని రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నాడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ. వివాదాల‌తోనే బోలెడంత ప‌బ్లిసిటీ ద‌క్కించుకున్న చిత్ర‌మిది. ప్ర‌పంచమంతా ఒక‌టే క్యూరియాసిటీ. క్లాసిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతున్నాడో.. ప‌ద్మావ‌తి బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు సృష్టించ‌నుందో అంటూ ఒక‌టే ముచ్చ‌ట సాగుతోంది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో పోస్ట‌ర్‌, వీడియో లైవ్‌లోకి వ‌స్తున్నాయి. తాజాగా `ఏక్ దిల్ ఏక్ జాన్ ..` అంటూ సాగే ఓ మెలోడీని లాంచ్ చేశారు.

ఈ పాట చూస్తున్నంత‌సేపూ ఓ విష‌యం అర్థ‌మ‌వుతోంది. “మ‌ర‌ణాన్ని జ‌యించు.. శత్రువుపై గెలిచి రా.. అంటూ ప‌ద్మావ‌తి త‌న భ‌ర్త అయిన మ‌హారాజా రావ‌త్‌కి చెబుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ప‌ద్మావ‌తి క‌న్నీళ్ల అర్థం అదే. మృత్యువులాంటి అల్లా ఉద్దీన్ ఖిల్జీని ఎదుర్కోవ‌డం అంటే అసాధార‌ణ సాహ‌సం. ఆ సాహ‌సం చేస్తున్న భ‌ర్త‌ను అంతే ఉత్సాహంగా యుద్ధానికి పంపించేయ‌డ‌మంటే మాట‌లా? అందుకే ప‌ద్మావ‌తి చెంప‌ల‌పైకి క‌న్నీళ్లు జ‌ల‌జ‌లా జాలువారాయి. మొత్తానికి ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో ఓ అపూర్వ ఘ‌ట్టాన్ని భ‌న్సాలీ అద్భుతంగా ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌ని .. ఓ గొప్ప క‌థాంశాన్ని భ‌న్సాలీ ఎంచుకున్నాడ‌ని ఈ పాటలోని థీమ్‌ చెబుతోంది. త‌న భ‌ర్త అయిన చిట్టోర్ రాజాని ఖిల్జీపై యుద్ధానికి పంపే క్ర‌మంలోని ఈ పాట విజువ‌ల్లీ సూప‌ర్భ్‌.

Tags : , , , , , , , , , , , , , , ,