పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమాకి మూడు టైటిల్స్ |Pawan Kalyan and Trivikram Movie Title

admin
pawankalyan

Pawan Kalyan’s new poster and music bit is a super-rapper response.click on the below video to know more details of Pawan Kalyan and Trivikram Movie Title

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన కొత్త పోస్టర్ , మ్యూజిక్ బిట్ కి సూపర్ డూపర్ రెస్పాన్స్ వినిపిస్తోంది.

మొదటగా వచ్చిన పోస్టర్ కాన్సెప్ట్ తో ఉంటుంది అన్నారు కానీ ఆ రకంగా ఏమీ కనపడలేదు. అయితే మ్యూజిక్ బిట్ మాత్రం జనాలకి బాగా ఎక్కేసింది. బయటకొచ్చి చూస్తే టైం ఏమో త్రీ యో క్లాక్ , ఇంటికెళ్ళే రూటు మొత్తం రోడ్డు బ్లాక్ అంటూ సాగిన ఈ చిత్రం అనిరుధ్ స్వయంగా పాడడం విశేషం. జల్సా లో మై హార్ట్ ఈజ్ బీటింగ్ స్టైల్ లో అనిపించింది ఈ పాట . త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ చిత్రం వస్తుంది అంటే ఆ చిత్రంపై భారీ కాదు అతి భారీ అంచనాలే ఉన్నాయి. వారి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఈ మూడో చిత్రంపై మాత్రం లెక్కకు మించి అంచనాలే ఉన్నాయి.

ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయ్యిందని… మిగతా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తవుతుందని చెబుతుంది చిత్ర యూనిట్. ఇకపోతే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున పవన్ తన ఫాన్స్ కి ఏదో ఒక ట్రీట్ ఇస్తాడని పవన్ ఫాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు కూడా. అందుకే ఫాన్స్ ని డిజప్పాయింట్ చెయ్యకుండా ఇలా ‘కాన్సెప్ట్ పోస్టర్’ తో సరిపెట్టేసింది చిత్ర యూనిట్.ఇక ఆ పోస్టర్ లో పవన్ వెనక్కి తిరిగిన లుక్ అజ్ఞాతవాసానికి వెళుతున్న బాటసారి లా ఉంటే, మరొకటి పవన్ దీర్ఘ ఆలోచనలో డ్రాయింగ్ వేసిన లుక్ ఒకటి… అలాగే ‘పీఎస్ పీకే#25’ హ్యాష్ ట్యాగ్ ఉన్నాయి. వీటన్నిటిని కలుపుతూ ఒక మ్యాప్ స్కెచ్ పోస్టర్ అంతా కనిపిస్తుంది. మ్యాప్ కనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ చాలా దూరం నడుస్తున్నాడనే సాంకేతాన్ని ఇస్తుంది. ఈ సినిమా టైటిల్ ఏమిటనేది చిత్ర యూనిట్ సస్పెన్స్ లో పెట్టినా..ఈ కాన్సెప్ట్ పోస్టర్ ప్రకారం చూస్తే.. ఈ చిత్రానికి మూడు టైటిల్స్ కనిపిస్తున్నాయి. అందులో ఒకటి పవన్ నడుస్తున్న తీరును బట్టి ‘బాటసారి’ అని, పవన్ ఆలోచన విధానం ద్వారా చూస్తే ‘అజ్ఞాతవాసి’ అని అనుకోవచ్చు. పవన్ నడుస్తున్న తీరు, కనిపిస్తున్న మ్యాప్ చూస్తుంటే..ఈ సినిమా టైటిల్ పక్కాగా ‘బహుదూరపు బాటసారి’ అయ్యే ఉంటుంది అని తెలుస్తుంది. మరి చిత్ర యూనిట్ ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తారో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , ,