పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్ ఇదిగో! | Pawan Kalyan Birthday Gift | Brand Ambassador for Weavers

admin
Pawan Kalyan, Pawan Gift, Pawan to Weavers, Brand Ambassdor, KTR, Pawan Support, Newsmarg, Pawan Kalyan Birthday Gift, Brand Ambassador for Weavers, పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్ ఇదిగో!, Pawan Kalyan Gift, Power Star gift, Birthday Gift, telugu movie news, tollywood news, pawan kalyan family, pawan kalyan birthday gift for fans, birthday special, telugu film news, powerstar pawan kalyan

మన రాష్ట్రంలో చేనేత రంగం అత్యంత ప్రాచీనమైనదే కాదు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది కూడా.

అయితే తరాల అంతరం, మర మగ్గాలు వచ్చిన తర్వాత చేనేత కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం చేనేత వృత్తిని, ఆ రంగంలో ఉన్న కార్మికులను కాపాడేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణాలో చేనేత కళాకారులని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కెటీఆర్ తలపెట్టిన యజ్ఞంకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనవంతు సాయంగా, చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ ఉండేందుకు ముందుకొచ్చాడు.

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ తన బర్త్ డే సెప్టెంబర్2 ను పురస్కరించుకొని birthday గిఫ్ట్ గా ఈ వారం రోజుల పాటు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించి, మన దేశ సంపద, సంస్కృతికి మద్దతు తెలపాలని జనసేన పిలుపునిచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పిలుపుకి హీరోలు, దర్శకులు అందరు ధరిస్తూ తమ మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ హ్యాండ్ లూమ్ డీపీకి సపోర్ట్ చేస్తూ ఈ వారం రోజులు చేనేత వస్త్రాలు ధరిస్తామంటూ ముందుకి వస్తున్నారు. ఇప్పుడు ఈ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో విస్తృతంగా నడుస్తుంది. అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ అది ఇది. అందుకే మేము పవన్ కళ్యాణ్ అభిమానులం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లతో హోరెత్తిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విధంగానైనా చేనేత కార్మికులకు ఉపాధి దొరికితే అంతకంటే కోరుకునేదేముంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,