శివ బాలాజీ గెలుపు వెనుక ఉన్నదెవ‌రో తెలిస్తే షాకే! | Pawan Kalyan Fans To Support Siva Balaji?

admin
shiva

Telugu Big Boss Cigano One Show, the first ever commentator of Tollywood Young Tiger Junior NTR, concludes Sunday’s grand finals.

There is no exaggeration to say that this gave a new feel to the Telugu audience. Will such realty shows enjoy the Telugu audience?
Will they have access to it? The Big Boss Reality Show Telugu Nativity was a huge success by making doubts about the suspicions. Click on the below video to know more details of Pawan Kalyan Fans To Support Siva Balaji?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తొలిసారిగా వ్యాఖ్యాత‌గా నిర్వ‌హించిన తెలుగు బిగ్ బాస్ సిజ‌న్ వ‌న్ షో ఆదివారం జ‌రిగిన గ్రాండ్ ఫైనల్స్ ముగిసిన విష‌యం తెల్సిందే. ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతి ఇచ్చింద‌ని చెప్ప‌టంలో ఎటువంట అతిశ‌యోక్తి లేదు. ఇటువంటి రియాల్టీ షోలు తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఆద‌రిస్తాయా?
వారి నుంచి ఆధ‌ర‌ణ ల‌భిస్తుందా? అనే అనుమానాల‌ను ప‌టాఫంచ‌లు చేస్తూ బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు నాట ఘ‌న విజ‌యం సాధించింది. దీనికి ఉదాహ‌ర‌ణ దీని ఫైన‌ల్లో ఓటింగ్‌లో సుమారుగా 11 కోట్ల మంది ఓటింగ్ పాల్గొన‌ట‌మే. ఈ షో ఈ స్ధాయిలో స‌క్స్‌స్ కావ‌టానికి ప్ర‌ధాన‌మైన కార‌ణం జూనియ‌ర్ ఎన్టీఆర్ అని వేరే చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఈ క్రెడిట్ అంతా ఎన్టీఆర్ కే ద‌క్కుతుంది. అయితే శివ బాలాజీ విన్న‌ర్ అవుతార‌నే తొలి నుంచి చాలా మందిలో అంచ‌నాలు ఉన్నాయి. ఈ షోను మొద‌టి నుంచి క్ర‌మం త‌ప్ప‌కుండా తిల‌కించే చాలా మంది శివ బాలాజీ విన్న‌ర్ అవుతార‌ని అంచ‌నా వేశారు. కానీ ఆ త‌ర్వాత న‌వ‌దీప్‌, హ‌రితేజ‌లు కొంత పుంజుకోవ‌టంతో ఏమ‌వుతుందో అనే ఉత్కాంఠ నెల‌కుంది. ఏమైతేనే 70 రోజుల బిగ్ బాస్ రియాల్టీ షో విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ షోలో శివ బాలాజీ విజేత‌గా నిలిచారు. ర‌న్న‌ర‌ప్ ఆద‌ర్స్‌పై 8 ల‌క్ష‌ల ఓట్ల‌పైగా తేడా విజ‌యం సాధించారు. ఈ షోలో మొత్తం 16 మంది పాల్గొన్న విష‌యం తెల్సిందే. వారానికి ఒక్కరి చొప్ప‌న ఎలిమినెట్ అవుతూ వ‌చ్చారు. ఒక్క సంపూర్నేష్ బాబు మాత్ర‌మే ఉండ‌లేక మ‌ధ్య‌లో వెళ్లిపోయారు. ఏమైన భారీ విజ‌యం సాధించిన ఈ షోలో శివ బాలాజీ గెలుపుకు దోహ‌దం చేసిన వాళ్లు ఎవ‌రు అనే చ‌ర్చ మొద‌లైంది.

ఈ షో ను తిల‌కిస్తున్న‌ప్రేక్ష‌కులు వేసే ఓట్లు ఎక్కువ ఎవ‌రికి వ‌స్తే వారే విన్న‌ర్స్‌గా ప్ర‌క‌టిస్తార‌ని బిగ్ బాస్ వ్యాఖ్యాత ఎన్టీఆర్ మొద‌టే ప్ర‌క‌టించారు. కానీ ఆ ఓట్లు వేసేందుకు , వేయించేందుకు ఎవ‌రు పూనుకున్నారు? అనేది కూడా ముఖ్య‌మైన అంశ‌మే. శివ బాలాజీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన కాటంరాజు చిత్రంలో ప‌వ‌న్ త‌మ్ముడిగా న‌టించటం శివ బాలాజీకి బాగా క‌లిసి వ‌చ్చిందంటున్నారు. అలాగే శివ బాలాజీకి ప‌వ‌న్‌తో మంచి సంబంధాలే ఉన్నాయ‌ని, పెళ్లి విష‌యంలోనూ ప‌వ‌న్ ఆయ‌న‌కు స‌హ‌క‌రించార‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జ‌రిగింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఎక్కువ మంది శివ బాలాజీకి అనుకూలంగా ఓట్లు వేశార‌ని తెలుస్తోంది. ఎలిమినేష‌న్ టైంలో ఓ ద‌శంలో న‌వ‌దీప్, హ‌రితేజ‌ కంటే వెనుక‌బ‌డి శివ బాలాజీకి ఫైన‌ల్స్‌లో ప‌వ‌న్ అభిమానాలు పూర్తిగా మ‌ద్ద‌తుగా ఓటింగ్ చేశార‌ని అందుకే ఆయ‌న గెలుపు సాధ్య‌మైంద‌ని టాక్ న‌డుస్తోంది. ఏమైన మొద‌టి నుంచి త‌న ప‌ద్ద‌తిలో శివ బాలాజీ న‌డిశారు. ఎవ‌రి మెప్పుకోస‌మే త‌న తీరు మార్చుకోలేదు. అదీ కూడా శివ బాలాజీకి బాగా క‌లిసి వ‌చ్చి ఉంటుంది. ఓ ద‌శ‌లో ఇంటిలో సౌక‌ర్యాల‌పై బిగ్ బాస్ పై కూడా ఫైర్ అయ్యారు. శివ బాలాజీ ఫైర్ చూసి చాలా మంది హౌజ్‌మెట్స్ భ‌య‌ప‌డ్డారు కూడా. ఏమైన శివ బాలాజీ విన్న‌ర్ కావ‌టంలో న్యాయ‌మం ఉంది. ప్రేక్ష‌కులు స‌రైన తీర్పే ఇచ్చారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,