ల‌వ్ క‌పుల్ సైలెంటుగా జంప్ ఆ త‌ర్వాత‌! | Love Couple Deepika And Ranveer Rushed from Award ceremony

admin
love couple

Deepika Padukone and Ranveer Singh look absolutely adorable together, not only on screen but off screen too. Although the duo never came out in open about their alleged relationship, it has been more than obvious for the onlookers. Click on the below to video to know more details of Love Couple Deepika And Ranveer Rushed from Award ceremony

ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చారు. కాసేపు అంద‌రి ముందూ హంగామా చేశారు. క‌ట్ చేస్తే.. ఏమ‌య్యారో ఎవ‌రికీ తెలీదు. ఆ ప్రాంగ‌ణం లోంచే మిస్‌.. అస‌లేం జ‌రిగింద‌మబ్బా..! ఇంత‌కీ ఏమైంది ఈ ప్రేమ‌జంట‌?

దీపిక ప‌దుకొన్‌- ర‌ణ్‌వీర్ సింగ్ ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. రామ్‌లీల సినిమాలో జంట‌గా న‌టించిన‌ప్ప‌టినుంచి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఘాటైన ప్రేమాయ‌ణం సాగుతోంద‌ని బాలీవుడ్‌లో ప్ర‌చార‌మ‌వుతోంది. దానిని నిజం చేస్తూ ఈ జంట ప‌లు సంద‌ర్భాల్లో చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిరిగేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. ప్రేమ‌లు, గొడ‌వ‌లు ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స‌ర్వ‌సాధ‌ర‌ణ‌మేన‌ని, ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో విడిపోయేంత‌ పొర‌పొచ్చాలు వ‌చ్చాయ‌ని ప్ర‌చార‌మైంది. రీసెంటుగా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీపిక ట్రిపుల్ ఎక్స్ హీరోతో ప్రేమ‌లో ప‌డింద‌ని.. ర‌ణ్‌వీర్‌కి హ్యాండిచ్చింద‌ని చెప్పుకున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ జోడీ స్టాట‌స్ ఏంటి? అని ప్ర‌శ్నించిన వారికి ఒకే ఒక్క స‌మాధానం. ఆ ఇద్ద‌రూ డీప్ ల‌వ్‌లో ఉన్నారు. క‌లిసే షికార్లు చేస్తున్నార‌ని ప్రూఫ్ ల‌భించింది.

తాజాగా ఈ జోడీ ఫిలింఫేర్ గ్లామ‌ర్ అండ్ స్టైల్ అవార్డు వేడుక‌ల నుంచి స్కిప్ కొట్ట‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. దీపిక – ర‌ణ్‌వీర్ జంట అవార్డు ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి, చాలా ముందుగా స్కిప్ కొట్టారుట‌. అక్క‌డి నుంచి సైలెంటుగా ఎస్కేప్ అయ్యార‌ని, ఆ త‌ర్వాత ద‌ర్శ‌కురాలు జోయా అక్త‌ర్ ఇంటికి వెళ్లార‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ వెబ్ పేర్కొంది. ఒకే కార్‌లో అవార్డు వేడుక‌కు విచ్చేశారు. ఒకే కార్‌లో అక్క‌డినుంచి స్కిప్ కొట్టారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో అంటూ హైప్ క్రియేట్ చేప్తూ ప్ర‌ముఖ బాలీవుడ్ వెబ్‌సైట్ పింక్ విల్లా ఆర్టిక‌ల్ ప్ర‌చురించింది. అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రుగుతున్న‌ట్టు?

Tags : , , , , , , , , , , , , , , , , , ,