క్రేజీ క్రేజీ : ప‌్ర‌భాస్ – స‌ల్మాన్ క‌ల‌యిక‌?

admin
prabhas and salman khan movie,

కొన్ని క‌ల‌యిక‌లు ఊహాతీతంగానే ఉంటాయి. ఆ క‌ల‌యిక‌లు సంచ‌ల‌నాల‌కు తెర తీస్తాయి. ఇదేదో ఆ త‌ర‌హా క‌ల‌యికే అనిపిస్తోంది.


బాహుబ‌లి సిరీస్‌తో జాతీయ, అంత‌ర్జాతీయ‌ స్థాయి మార్కెట్‌ని అందుకున్న ప్ర‌భాస్ .. అప్ప‌టికే జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో పాపుల‌రైన స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి సినిమా చేయ‌బోతున్నాడుట‌. కాదు.. ఆ ఇద్ద‌రినీ క‌లిపి ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి అదిరిపోయే స్కెచ్ వేశాడుట‌.

ఈ ఆలోచ‌నే అద్భుతంగా ఉంది. ప్ర‌భాస్ అభిమానుల‌కు చెవిలో అమృతం పోసినంత‌.. సొంపుగా ఉంది. మొత్తానికి ఇదే నిజ‌మైతే .. ఇక ఇండియన్ సినిమా హిస్ట‌రీలో ఉన్న అన్ని రికార్డులు మ‌రోసారి తుడిచేయ‌డం ఖాయం. ఎందుకంటే ఒక‌రు ఉత్త‌రాదికి రారాజు. వేరొక‌రు ద‌క్షిణాదికి మ‌హారాజు. ఆ ఇద్ద‌రూ క‌లిస్తే రికార్డులే రికార్డులు. సంచ‌ల‌నాలే సంచ‌ల‌నాలు.

ఇప్ప‌టికైతే ఈ క‌ల‌యిక థాట్ ప్రాసెస్‌లోనే ఉంది. రోహిత్ శెట్టి మ‌న‌సులో ఉన్న‌ది చెప్పాడు. దానికి ప్ర‌భాస్‌, స‌ల్లూ భాయ్‌ల నుంచి సానుకూల నిర్ణ‌యం వెలువ‌డింద‌ని చెబుతున్నారు. ఇప్పుడే సెట్స్‌కెళ్ల‌క‌పోయినా .. టైమ్ తీసుకున్నా .. ఈ క‌ల‌యిక‌లో సినిమా అంటూ ఉంటుందిట‌.

ఇక‌పోతే డార్లింగ్ ప్ర‌భాస్ ఇప్ప‌టికే తెలుగులో ఇచ్చేసిన క‌మిట్‌మెంట్లు పూర్తి చేసే హ‌డావుడిలో ప‌డ్డాడు. సాహూ పూర్త‌య్యాక .. ఒక‌వేళ అప్ప‌టికి రోహిత్ శెట్టి స్క్రిప్టు ప‌క్కాగా పూర్త‌యితే… ఈ సినిమా సెట్స్‌కెళ్లే ఛాన్సుందేమో?

ఈ వార్త‌తో ఉత్త‌రాది- ద‌క్షిణాది సంగ‌మించే త‌రుణం ఆస‌న్న‌మైందని అర్థ‌మ‌వుతోంది. మ‌నం అంతా ఎదురు చూస్తున్న ఆస‌క్తిక‌ర త‌రుణ‌మే ఇది. తెలుగు సినిమా, త‌మిళ సినిమా.. హిందీ సినిమా అనే విభేధం స‌మ‌సిపోయే త‌రుణమిదేన‌ని చెప్పాలి. ఆ త‌రుణం రానే వ‌చ్చింది. అందుకు ఇదిగో సాక్షాత్కారం. మ‌న ప్ర‌భాస్ .. ఏకంగా భాయిజాన్ స‌ల్మాన్ ఖాన్‌తోనే క‌ల‌సి న‌టించే ప్రాజెక్టుకు తెర లేచిందంటే అది ఆషామాషీ ప్రాజెక్ట్ కాదు. ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇటు ప్ర‌భాస్ అభిమానుల్ని ఎంతో ఎగ్జయిట్ చేసేస్తోంది.

ఈ దెబ్బ‌కు ఉత్త‌రాది- ద‌క్షిణాది బాక్సాఫీస్‌లు షేక‌యిపోవాల్సిందేన‌న్న టాక్ వినిపిస్తోంది. బాహుబ‌లిని, భాయిజాన్‌ని క‌లిపే ప్ర‌య‌త్నం అసాధార‌ణ‌మైన‌ది. అద్భుత‌మైన‌ది. ఒక జాతీయ స్థాయి న‌టుడితో.. త‌న‌ని తాను జాతీయ స్థాయి న‌టుడిగా ఆవిష్క‌రించుకున్న హీరో .. క‌లిసి న‌టించ‌డం.. అది కూడా ఉత్త‌రాది- ద‌క్షిణాది మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ క్యాలిక్యులేట్ చేసి మ‌రీ ఈ సినిమా తీయాల‌ని అనుకోవ‌డం ఇవ‌న్నీ శుభ‌ప‌రిణామాలుగానే క‌నిపిస్తున్నాయి.

బాహుబ‌లి సిరీస్‌తో ప్ర‌భాస్ ఓ కొత్త అర్హ‌త సాధించాడు. అదే ఈ అవ‌కాశాన్ని తెచ్చి పెడుతోంది. ఇలాంటివి మ‌రెన్నో మ‌న డార్లింగ్‌కి బాలీవుడ్ నుంచి క్యూ క‌ట్ట‌బోతున్నాయి. ప్ర‌భాస్ ఇప్ప‌టికే జాతీయ స్థాయి న‌టుడిగా స్థిర‌ప‌డిపోయాడు జ‌నాల మైండ్‌లో.. అందుకే రోహిత్ తెలివైన ఎత్తుగడ వేశాడంటూ సినీజ‌నాల్లో టాక్ మొద‌లైంది.

ఇక ఈ ఇద్ద‌రూ క‌లిస్తే అదో సంచ‌ల‌న‌మే అవుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియాలో ఉన్న అన్నిరికార్డుల్ని చెరిపేసే అరుదైన స‌న్నివేశం రానుంది మ‌రోసారి. అలాగే ఈ సినిమాతో స‌ల్మాన్ భాయ్ తెలుగు వారికి మ‌రింత‌గా చేరువైపోవ‌డం ఖాయం. దానివ‌ల్ల స‌ల్మాన్ మార్కెట్ ప‌రిధి కూడా మ‌న సౌత్‌కి పూర్తి స్థాయిలో విస్త‌రించే ఛాన్సుంటుంది.

బాహుబ‌లి రికార్డుల్ని వేటాడుతూ భ‌జ‌రంగి భాయిజాన్ ఆడింది. అప్ప‌టికి పీకే టాప్ -1 పొజిష‌న్‌లో ఉంటే .. ఆ త‌ర్వాతి స్థానంలో బాహుబ‌లి, భ‌జ‌రంగి భాయిజాన్ నిలిచాయి. ఆ త‌ర్వాత అమీర్‌ఖాన్ `దంగ‌ల్‌` బ‌రిలోకి దిగి అన్ని రికార్డుల్ని చెరిపేసింది. ఆ రికార్డుల్ని కొట్టేదెవ‌రు? అనుకుంటున్న టైమ్‌లోనే ప్ర‌భాస్ న‌టించిన `బాహుబ‌లి-2` రిలీజై అన్నిటికీ కొట్టేసింది. చాలా త‌క్కువ టైమ్‌లో రికార్డులు కొల్ల‌గొట్టిన సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. ఇప్పుడు చైనా రిలీజ్‌తో దంగ‌ల్ మ‌ళ్లీ నంబ‌ర్ -1 పొజిష‌న్‌కి చేరుకుంది. ఈసారి ప్ర‌భాస్ – స‌ల్మాన్ క‌లిసి న‌టిస్తే `దంగ‌ల్‌` రికార్డుల్ని చెరిపేయాల్సి ఉంటుంది. ఈ ఆట ఎంతో ఇంట్రెస్టింగ్ గానూ ఉంది. అంతేకాదు భ‌విష్య‌త్ మార్కెట్‌కి ఓ దారి చూపించేదిగానూ ఉందంటే అతిశ‌యోక్తి కాదు. వ్వావ్ .. వ్వావ్‌.. సూప‌ర్భ్ ఐడియా రోహిత్‌…

Tags : , , , , , , , , , , , , , , , , , , ,