ప్ర‌భాస్ వైజాగ్ అల్లుడా!

surendra a
prabhas

బాహుబ‌లి ప్రభాస్ కు వైజాగ్ అమ్మాయితో సంబంధం కుదిరిందా? బాహుబ‌లి-2 త‌ర్వాత మూడు ముళ్లు..ఏడ‌డుగులు వేయ‌నున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఫుల్ డీటైల్స్ లోకి వెళ్తే..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి కోసం అభిమానులు..ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లి-2 షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే ఇక పెళ్లి ఖాయ‌మ‌ని ఓ నిర్ణ‌యానికి కూడా వ‌చ్చేశారు. దీంతో ప్ర‌భాస్ పై మ‌రింత ఒత్తిడి పెరిగింది. ఇప్ప‌టికే లేటు.. చేసేసుకుందామ‌ని ఆయ‌న ఫిక్స్ అయిపోయాడు. అటు కుటుంబ స‌భ్యులు పిల్ల‌ను వెతికే ప‌నిలో కూడా ప‌డ్డారు. అయితే తాజాగా పెళ్లికూతురు ఎంపిక జ‌రిగిపోయింది అంటూ ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు చ‌క్కెర్లు కొడుతున్నాయి.

ప్రభాస్ వైజాగ్ అల్లుడు కాబోతున్నాడ‌ట‌. వైజాగ్ కి చెందిన ఓ వెల్‌నోన్ బిజినెస్‌మేన్ కుమార్తెతో మ‌నువు కుదుర్చుకునేందుకు మాట‌లు జ‌రుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అన్ని కుదిరితే వ‌చ్చే ఏడాది వేస‌విలో వివాహానికి ముహూర్తం నిర్ణయించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. అయితే ఈ విష‌యాలు అధికారికంగా వెల్ల‌డి కావాల్సియుంది.

Tags : , , , , , , , ,