ర‌జ‌నీ క‌మ‌ల్ ఇంటికి ఎందుకు వెళ్లాడో తెలుసా?

సౌత్ ఇండియా స్టార్ హీరో ర‌జ‌నీకాంత్ ఇటీవ‌ల క‌మ‌ల్‌హాస‌న్ ఇంటికి వెళ్ల‌టంపై అనేక క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. కానీ వాస్త‌వం మ‌రోలా ఉంది.

దర్శక దిగ్గజం శంకర్ ఇప్పుడు రోబో సీక్వెల్ ‘2.0’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నుంచి కూడా అనేకమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుద‌ల‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ను ప్ర‌మోట్ చేయ‌డానికి రూ. 40 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారు. ఫ‌స్ట్ లుక్‌ను భారీగా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్న చిత్ర యూనిట్ ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ హీరో క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌త్యేక అతిథిగా ఆహ్వానించారు. ఆయ‌న్ని ఈ కార్య‌క్ర‌మానికి ఇన్వైట్ చేయ‌డానికి ర‌జ‌నీకాంత్ క‌మల్ హాస‌న్ ఇంటికి వెళ్లార‌ని స్ప‌ష్టం అయింది. దీంతో ఇంత కాలం వీరిద్ద‌రి క‌ల‌యిక‌పై అనేక ర‌కాల క‌థ‌నాలు ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే కార్య‌క్ర‌మానికి క‌మ‌ల్‌హాస‌న్‌తో బాలీవుడ్‌బాద్ షా షారుక్‌ఖాన్ కూడా హాజ‌రవుతున్నారు.

Add your comment

Your email address will not be published.