చిరంజీవితో ఎప్పుడో క‌లిసిపోయాం | Rajasekhar About Meeting With Chiranjeevi | Jeevitha

admin
rajasekhar

They felt threatened by his entrance into politics and had some other issues too. Chiranjeevi met them personally when fans attacked the couple and few trolls on each other have been exchanged in each other’s films too.Click on the below video to know more details of Rajasekhar About Meeting With Chiranjeevi | Jeevitha

మెగాస్టార్ చిరంజీవి- రాజ‌శేఖ‌ర్ ల మ‌ధ్య ఒక‌ప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో వివాదాలుండేవి. చాలా కాలం పాటు ఇరువురి మ‌ధ్య త‌గ్గాఫ్ వార్ గానే ఉండేది. అయితే ఇటీవ‌ల గ‌రుడ‌వేగ ట్రైల‌ర్ ను జీవితరాజ‌శేఖ‌ర్ స్వ‌యంగా చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయ‌న‌ చేతుల మీదుగా లాంచ్ చేయించ‌డంతో స‌మ‌స్య‌ల‌న్నీ స‌మ‌సిపోయాయ‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే వీటిపై తాజాగా రాజ‌శేఖ‌ర్ స్పందించారు.

చిరంజీవితో వివాదాలుండేవి. కానీ అవి తొల‌గిపోయి చాలా కాల‌మ‌వుతోంది. ఇద్ద‌రం క‌లిసిపోయాం. హ్యాపీగానే ఉన్నాం. కానీ మీడియాతో మాత్రం టార్గెట్ చేసి మ‌రీ క‌థ‌నాలు రాస్తోంది. రాజ‌శేఖ‌ర్ కు ఇప్ప‌టికి బుద్ది వ‌చ్చిందాంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లొచ్చాయి. ద‌య‌చేసి అలాంటి వార్త‌లు రాయోద్దని మీడియాను వేడుకుంటున్నాని రాజ‌శేఖ‌ర్ అభ్య‌ర్థించారు.

“చిరంజీవితో మ‌నస్ఫ‌ర్థ‌ల త‌ర్వాత వెంట‌నే క‌లిసిపోయాం. అయినా రాజ‌శేఖ‌ర్‌కి ఇప్పుడే బుద్దొచ్చింది అంటూ రాశారు. ఆయ‌న‌తో ఎప్పుడో క‌లిసిపోయాం.. చిరంజీవి నుంచి మ‌మ్మ‌ల్ని విడ‌దీయొద్దు..“ అని కోరారు. అయినా మ‌న‌స్ఫ‌ర్థ‌ల‌తో విడిపోయాక మ‌ళ్లీ క‌ల‌వ‌కూడ‌దా.. క‌లిసి ఉండ‌కూడ‌దా? ద‌య‌చేసి అలా రాయొద్ద‌ని అభ్య‌ర్థించారు. గ‌రుడ‌వేగ స‌క్సెస్‌మీట్‌లో రాజ‌శేఖ‌ర్ ఎమోష‌న‌ల్ స్పీచ్ ఇది.

అంకుశం కంటే తాజా చిత్రం గ‌రుడ‌వేగ‌ పెద్ద స‌క్సెస్ అయ్యింది. అందుకు కార‌ణ‌మైన ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్‌. జీవిత వ‌ల్ల‌నే ఈ సినిమా పూర్తైంది. జీవిత ఈ సినిమాను నాకు గిఫ్ట్‌లా ఇచ్చింది. చిరంజీవిగారికి థాంక్స్‌. ఆయ‌న మా సినిమాను చూసి ప్ర‌త్యేకంగా అభినందించారు. బొకే పంపించార‌ని రాజ‌శేఖ‌ర్ ఆనందం వ్య‌క్తం చేశారు. మొత్తానికి చాలా కాలానికి రాజ‌శేఖ‌ర్ ఒక హిట్ కొట్టారు. అందుకే ఇంత ఎమోష‌న్ అయ్యార‌న్న‌మాట‌!

Tags : , , , , , , , , , , , , , , ,