హీరోయిన్‌గా జీవితా రాజ‌శేఖ‌ర్ గారాల ప‌ట్టీ

టాలీవుడ్ ఆద‌ర్శ జంట జీవిత‌- రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివానీ క‌థానాయిక అవుతోందిట‌. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే అంటూ ఇదివ‌ర‌కూ చాలా సార్లు వార్త‌లొచ్చినా నిజం కాలేదు. కాస్త లేటెగా అయినా లేటెస్టుగా ఎంట్రీ ఇస్తోంది ఈ వార‌సురాలు. చెక్ దిస్ స్టోరీ..

హీరో రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివానీ సినీఆరంగేట్రం గురించి గ‌త కొంత కాలంగా వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎట్ట‌కేల‌కు శివానీ క‌థానాయిక అవుతోంద‌న్న శుభ‌వార్త అందింది. అయితే తొలుత త‌మిళంలో అదృష్టం ప‌రీక్షించుకుని, అటుపై తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టేందుకు శివానీ ప్లాన్ చేస్తోందిట‌. ఆ మేర‌కు ఇప్ప‌టికే ఓ క్రేజీ ప్రాజెక్టుకు ఎంపికైంద‌ని తెలుస్తోంది.

అప్ప‌ట్లో విక్ర‌మ్ ప్ర‌భు క‌థానాయ‌కుడిగా ప్ర‌భు సోల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `గ‌జ‌రాజు` (గుంకి) చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. త‌మిళంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించేందుకు శివానీ అంగీక‌రించిందిట‌.

శివానీ ఇప్ప‌టికే న‌ట‌న స‌హా భ‌ర‌త‌నాట్యం, సింగింగ్‌, కీబోర్డ్ ప్లే వంటివి నేర్చుకుంది. బాక్సింగ్‌లోనూ ప్రావీణ్యం ఉంద‌ని చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో క‌థానాయకుడు ఎవ‌రు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ రివీల్ కాలేదు. ఇక తొంద‌ర్లోనే శివానీ ఎంట్రీ గురించి అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ఫిలింన‌గ‌ర్‌లో మాట్లాడుకుంటున్నారు.

Add your comment

Your email address will not be published.