కృష్ణవంశీకి రమ్యకృష్ణ దూరంగా ఉండడానికి అసలు కారణం | Reason Why Ramya Krishna Krishna Vamsi Separated

admin
krishna vamsi

there are always multiple rumors about the relationships between the film personalities in the industry. Many at times, we have seen director Krishna Vamsi and Ramya Krishna being stuck in the rumors. Click on the below video to know more details of Reason Why Ramya Krishna Krishna Vamsi Separated

దాదాపు మూడు ద‌శాబ్దాల‌కు పైగా అప్ర‌తిహతంగా సినీ కెరీర్‌ను కొన‌సాగిస్తున్న న‌టి ర‌మ్య‌కృష్ణ‌. ఇప్ప‌టికీ శివ‌గామి వంటి పాత్ర‌ల‌తో దేశ‌వ్యాప్తంగా త‌న ఇమేజ్‌ను పెంచుకుంటోంది. కెరీర్ పరంగా ఆమె చాలా సంతృప్త ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌క్తిగ‌తంగా ఆమె జీవితం స‌మ‌స్య‌ల్లో ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీని గ‌తంలో ర‌మ్య‌కృష్ణ ప్రేమించి, పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ, ర‌మ్య‌కృష్ణ‌ల మ‌ధ్య విభేదాలు తలెత్తాయ‌ని, అందుకే ర‌మ్య‌కృష్ణ చెన్నైలోనూ, కృష్ణ‌వంశీ హైద‌రాబాద్‌లోనూ ఉంటున్నారని పుకార్లు బ‌య‌ల్దేరాయి. దీని గురించి ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించింది ర‌మ్య‌.

నేను ప్ర‌స్తుతం సినిమాల‌తో, సీరియ‌ళ్ల‌తో బిజీగా ఉన్నాను. ఓ న‌టిగా సాధ్య‌మైనంత వ‌ర‌కు కెరీర్ కొన‌సాగించాల‌నే కార‌ణంతోనే నేను చెన్నైలో ఉంటున్నాను. భార్య‌ ఆశ‌యాల‌ను, కోరిక‌ల‌ను అర్థం చేసుకునే భ‌ర్త ల‌భించ‌డం చాలా రేర్‌. నాకు ఆ అదృష్టం ద‌క్కింది. నా మీద ఎంతో న‌మ్మ‌కంతో నా భ‌ర్త నాకు స్వేచ్ఛ ఇచ్చారు. అయినా మేమిప్పుడు చెట్ల చుట్టూ తిరిగి పాట‌లు పాడుకునే వ‌య‌సులో లేము. మేమిద్ద‌ర‌మూ చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించే వ్య‌క్తులం. మేము విడిగానే ఉన్న‌ప్ప‌టికీ ఫోన్ ద్వారా ఎప్ప‌డూ ట‌చ్‌లోనే ఉంటాం. ఒక‌రి పని గురించి మరొకరం తెలుసుకుంటుంటాం. హైద‌రాబాద్ లేదా చెన్నైలో వీలైన‌పుడు క‌లుస్తుంటాం. అప్పుడ‌ప్పుడు వెకేష‌న్ల‌కు కూడా వెళ్తుంటామ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది ర‌మ్య‌కృష్ణ‌. అయితే..

ఇలా పలుమార్లు వారిద్దరూ నొక్కి చెబుతున్నా వారిద్దరూ దూరంగా ఉండడానికి డబ్బు కారణమయ్యిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. గతంలో మంచి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ప్రస్తుత పరిస్థితి వేరు. కాని రమ్యకృష్ణ మాత్రం ఇప్పటికీ నటిగా బాగానే సంపాదిస్తోంది. దాంతో అతడు ఆమె సంపాదన ఖర్చు చేస్తున్నాడట. అయితే కొడుకు భవిష్యత్తు దృష్ట్యా రమ్యకృష్ణ ఆయనకు దూరంగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అంతే తప్ప వారిద్దరి మధ్యా తీవ్రమైన విభేదాలు కూడా ఏమీ లేవని చెబుతున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , ,