జూ. ఎన్టీఆర్’ పై ‘రేణు దేశాయి’ షాకింగ్ కామెంట్స్ | Renu Desai Shocking Comments On Jr NTR

admin
Renu

Power star Pawan Kalyan ex-wife Renu Desai is always active in the social media. Currently she is judging ‘Neethone Dance’ programme on Star Maa channel.In the recently telecast program, Renu Desai shocking comments on Young Tiger JrNTR. Click on the below video to know more details of Renu Desai Shocking Comments On Jr NTR

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తాజాగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మీద చేసిన కామెంట్లు ఇప్పుడు తెలుగు సినీజ‌నాల్లో పెద్ద సంచ‌ల‌నంగా మారాయి. ఈ జ‌న‌రేష‌న్ హీరోల్లో డైలాగ్ చెప్పాల‌న్నా, డ్యాన్స్ చేయాల‌న్నా, ఎలాంటి పాత్ర‌ను అయినా అవ‌లీల‌గా చేయాల‌న్నా ఎన్టీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. ఈ న‌ట‌రుద్రుడికి నాటి త‌రం హీరోల నుంచి నేటి త‌రం హీరోల వ‌ర‌కు ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. ఎన్టీఆర్ ప్ర‌స్తావ‌న వ‌స్తే చాలు మ‌నోడిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కుర‌వాల్సిందే.

తాజాగా ఎన్టీఆర్‌పై ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ వైఫ్ రేణుదేశాయ్ ప్ర‌శంస‌లు కురిపించారు. తెలుగులో ప్ర‌స్తుతం నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తోన్న రేణు దేశాయ్ ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఓ కంటెస్టెంట్ తార‌క్ డ్యాన్స్‌కు పెర్పామ్ చేశాడు. ఈ కంటెస్టెంట్ చేసిన పెర్పామెన్స్ మీద త‌న ఒపీనియ‌న్ చెప్పేముందు రేణు తార‌క్ గురించి మాట్లాడింది.

తెలుగులో లెజెండ‌రీ సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత ఆ రేంజ్‌లో ఈ జ‌న‌రేష‌న్‌లో ఒక్క తార‌క్ మాత్ర‌మే పౌరాణిక డైలాగులు ప‌ర్‌ఫెక్ట్‌గా చెప్తాడ‌ని రేణు తార‌క్‌ను ఆకాశానికి ఎత్తేసింది. అంతే కాదు తార‌క్ గొప్ప డ్యాన్సర్‌, చాలా సింపుల్‌గా స్టెప్పులు వేస్తాడ‌ని కితాబిచ్చింది. తార‌క్‌పై చాలా మంది ప్ర‌శంస‌లు కురిపించ‌డం కామ‌నే అయినా, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ భార్య అయిన రేణుదేశాయ్ ఈ రేంజ్‌లో ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో ఇండ‌స్ట్రీలో ఈ న్యూస్ జోరుగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,