ఫుట్‌బాల్ టోర్నీలో స‌ల్మాన్‌-క‌త్రిన మిరుమిట్లు? | Salman-Katrina Dazzle At FootBall League Ceremony

admin
salman

Indian Super League 2017-18 got underway in Kochi on Friday with Bollywood actors Salman Khan and Katrina Kaif giving a dazzling performance during the opening ceremony. Click on the below video to know more details of Salman-Katrina Dazzle At FootBall League Ceremony

ధూమ్మ‌చాలే.. ధూమ్ ధూమ్‌… మార్ మార్‌.. తీస్ మార్ ఖాన్ .. ఇలాంటి పాట‌ల‌కు త‌మ అభిమాన హీరో, హీరోయిన్ స్టెప్పులేస్తే అభిమానుల్లో ఆ హుషారే వేరు. ఇదిగో స‌ల్మాన్ – క‌త్రిన జోడీ అభిమానుల‌కు నిజంగానే అలాంటి విజువ‌ల్ ట్రీట్ ఇచ్చింది. అస‌లింత‌కీ ఈ ట్రీట్ వెన‌క అస‌లు కార‌ణ‌మేంటి? అంటే డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రీడ‌కు ఉన్న ఆద‌ర‌ణ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. క్రికెట్ ని మించి పాశ్చాత్యులు ఈ క్రీడ‌ను అభిమానిస్తారు. అందుకే ఫుట్‌బాల్ ఆట‌ను అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది భార‌త ఫుట్‌బాల్ స‌మాఖ్య‌. ఫుట్‌బాల్ అభిమానుల్ని అలరించేందుకు నెల‌రోజుల పాటు నిరాఠంకంగా సాగే, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)-4 సీజన్ అట్టహాసంగా ప్రారంభించింది. దేశంలోనే ఇది టాప్ లెవ‌ల్ సూప‌ర్‌లీగ్‌. ఈ శనివారం ప్రారంభమైన టోర్నీ 2018 మార్చి 18 వరకు నిరాఠంకంగా సాగనుంది.

ఈ ప్రారంభోత్స‌వంలో బాలీవుడ్ కండల హీరో స‌ల్మాన్ ఖాన్‌, హాట్ గాళ్ క‌త్రిన‌కైఫ్ నృత్యాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ధూమ్, తీస్ మార్ ఖాన్ సినిమాల నుంచి పాటలకు అదిరిపోయే స్టెప్పులేసింది ఈ జోడీ. కోల్ కతా, కేరళ జట్ల మధ్య తొలి మ్యాచ్ తో ఈ టోర్నీ ఘ‌నంగా మొద‌ల‌వుతోంది. ఇక స‌ల్మాన్ – క‌త్రిన జోడీ న‌టించిన `టైగ‌ర్ జిందా హై` డిసెంబ‌ర్ 22న‌ రిలీజ్‌కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. టైగ‌ర్ జిందా హై .. బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డులు సృష్టిస్తుంద‌ని ఇప్ప‌టికే అంచ‌నాలేర్ప‌డ్డాయి. ట్రైల‌ర్ రిలీజైన 24 గంట‌ల్లోనే కోట్లాది వ్యూస్‌తో దూసుకుపోవ‌డం ఓ సెన్సేష‌న్..

Tags : , , , , , , , , , , , , , , , ,