ఖైదీని కొట్టాల‌ని శాత‌క‌ర్ణి ప్లాన్‌?

surendra a
chiru-balu

మెగాస్టార్ చిరంజీవి కంటే న‌ట‌సింహా బాల‌య్య ఒక ఆకు ఎక్కువే తింటున్నాడు. ప్ర‌మోష‌న్‌లో అత‌డి దూకుడు చూస్తుంటే ఖైదీని కొట్టేయాల‌న్న క‌సి క‌నిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి- న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఈ ఇద్ద‌రూ సంక్రాంతి వార్‌లో పందెం కోళ్లులా రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో ఈ ఇద్ద‌రూ న‌టించిన సినిమాలు వ‌చ్చేస్తున్నాయి. ఖైదీ నంబ‌ర్ 150, గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి మోస్ట్ వాంటెడ్ రిలీజెస్‌గా .. ప్ర‌మోష‌న్ ఇప్ప‌టికే జోరందుకుంది. ఇటు చిరు అభిమానులు, అటు బాల‌య్య అభిమానులు గుడులు, గోపురాలు తిరిగి భారీ విజ‌యం కోసం హోమాలు, పూజ‌లు చేస్తున్నారు. 

ఈసారి మాత్రం సంక్రాంతి బ‌రిలో వార్ పందెం పుంజుల కొట్లాట‌లానే క‌నిపించేట్టుంది. 90ల‌లో చిరంజీవి, బాల‌య్య సినిమాలు వ‌స్తున్నాయంటే థియేట‌ర్ల క్యూలో అభిమానులు ఏ రేంజులో కొట్టుకునేవారో. కానీ ఇప్పుడు మారిన ట్రెండ్‌లో కొట్లాట వేరేగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే బాల‌య్య టీజ‌ర్‌తో  ఫ్యాన్ష్ ముందుకు వ‌చ్చేశారు. కానీ చిరు ఇప్ప‌టి వ‌ర‌కూ టీజ‌ర్ ఊసే ఎత్త‌లేదు. ఇటీవ‌లే మెగాస్టార్ రెండు పాట‌ల కోసం యూర‌ప్ వెళ్లి తిరిగిచ్చినా టీజ‌ర్, ఆడియో ఎప్పుడో చెప్ప‌నేలేదు. అయితే బాల‌య్య మాత్రం యాత్ర‌లు పేరుతో ఇప్ప‌టికే జ‌నాల్లోకి దూసుకెళ్లిపోయాడు. అలాగే థియేట్రికల్ ట్రైలర్, ఆడియో రిలీజ్ డేట్లను బాల‌య్య ముందే చెప్పేశాడు. ప్ర‌మోష‌న్ కోసం ముఖ్యమంత్రి, మంత్రులను ఆహ్వానించేస్తున్నాడు. మ‌రి న‌ట‌సింహా స్పీడు చూస్తుంటే ఖైదీ నంబ‌ర్ 150ని కొట్టేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి అస‌లైన ప్ర‌మోష‌న్ వార్‌లోకి చిరు ఎప్పుడు దూసుకొస్తాడో చూడాలి.

Tags : , , , , , , , , , , ,