సీనియ‌ర్ న‌టి అంబిక రీఎంట్రీ.. | Senior Actress Ambika Re Entry In Movies | Tollywood News

admin
ambika

.senior performing artist Ambika rentry in motion pictures. That is the data. Ambika is a Telugu heroine who has acted with top heros like Rajinikanth, Chiranjeevi and Kamal Haasan. Click on the below video to know more details of Senior Actress Ambika Re Entry In Movies.

నాటి మేటి నాయిక అంబిక వెండితెర‌పైకి పున‌రారంగేట్రం చేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్ వంటి టాప్ హీరోల‌తో న‌టించిన అంబిక‌ తెలుగు, త‌మిళ హీరోయిన్‌గా సుప‌రిచితం. ప‌లు క్లాసిక్ సినిమాల్లో న‌టించిన అంబిక చాలా కాలంగా న‌ట‌న‌కు దూర‌మ‌య్యారు. అయితే ఇటీవ‌లి కాలంలో సీనియ‌ర్ నాయిక‌ల రీఎంట్రీ జోరు త‌న ఆలోచ‌నల్లో మార్పు తెచ్చిందిట‌. త్వ‌ర‌లోనే వెండితెర‌పై పున‌రారంగేట్రం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

తెలుగు, త‌మిళ్‌లో మంచి అవ‌కాశాలొస్తే న‌టించేందుకు సిద్ధంగా ఉన్నారుట ఈ సీనియ‌ర్ న‌టి. ఇటీవ‌లే బిచ్చ‌గాడు ఫేం విజ‌య్ ఆంటోని న‌టించ‌నున్న త‌దుప‌రి చిత్రంలో అంబిక ఓ కీల‌క పాత్ర‌కు ఎంపికయ్యార‌ని తెలుస్తోంది. విజ‌య్ న‌టించిన తాజా చిత్రం `ఇంద్ర‌సేన‌` ఈనెల 30న రిలీజ‌వుతోంది. ఎన్‌కెఆర్ ఫిలింస్ ప‌తాకంపై నీల‌మ్ కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. త‌దుప‌రి `ట్రాఫిక్ రామ‌స్వామి` అనే చిత్రంలో విజ‌య్ ఆంటోని న‌టించ‌నున్నాడు. ఈ చిత్రంలో అంబిక ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నారు. సంఘంలోని కొన్ని అనూహ్య ప‌రిణామాల్ని `ట్రాఫిక్ రామ‌స్వామి` ఎలా ఎదురించి పోరాడాడు? అన్న ఆస‌క్తిక‌ర క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,