కూతురు వీడియో లీక్‌పై సీనియ‌ర్ గాయ‌ని ఫైర్!

admin
sunitha

“సింగర్ సునీత కూతురిని చూశారా.. కత్తి లాగా ఉంది” అంటూ హెడ్డింగ్ పెట్టాడు. ఆ హెడ్డింగ్ సునీత‌కు కోపం తెప్పించింది. అందుకే చెడామ‌డా తిట్టేస్తూ ఫైరైపోయారు.

యూట్యూబ్ లో రెవెన్యూ అన్న కాన్సెప్టుని ప‌లువురు ప‌లు ర‌కాలుగా ధ‌నార్జ‌న‌కు వినియోగించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాసెస్‌లో చాలా ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ అబాసు పాల‌వుతున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. చిల్ల‌ర హెడ్డింగుల‌తో వీక్ష‌కుడిని ఎట్రాక్ట్ చేసేందుకు నానా అగ‌చాట్లు ప‌డ‌డం క‌నిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ కి చెందిన సీనియ‌ర్ సింగ‌ర్ సునీత డాట‌ర్‌పై ఓ యూట్యూబ్ నిర్వాహ‌కుడు చేసిన ప‌ని వివాదాస్ప‌ద‌మైంది. స‌ద‌రు యూట్యూబ్ చానెల్ నిర్వాహ‌కుడిపై సునీత ఓ రేంజులో ఫైర‌య్యారు. త‌న కుమార్తెకు చెందిన వీడియోల్ని, ఫోటోల్ని యూట్యూబ్ చానెల్‌లో ప్ర‌మోట్ చేసిన స‌ద‌రు బుద్ధాగ్రేస‌రుడికి నానా చీవాట్లు పెట్టారు. గొడ‌వ పోలీస్ కేసు వ‌ర‌కూ వెళ్లేదే. స‌ద‌రు సింగ‌ర్ మంచిత‌నంతో లైట్ తీస్కోవ‌డంతో స‌ద్దుమ‌ణిగింది. 

అస‌లింత‌కీ స‌ద‌రు ప్ర‌బుద్ధుడు ఏమ‌ని హెడ్డింగ్ పెట్టాడు అంటే..? “సింగర్ సునీత కూతురిని చూశారా.. కత్తి లాగా ఉంది” అంటూ హెడ్డింగ్ పెట్టాడు. ఆ హెడ్డింగ్ సునీత‌కు కోపం తెప్పించింది. అందుకే చెడామ‌డా తిట్టేస్తూ ఫైరైపోయారు సునీత‌.  నా కూతురుపై నా అనుమ‌తి లేకుండా ఇలా చేస్తారా? ఆ హ‌క్కు మీకుందా? అంటూ సీరియ‌స్ అయ్యారు. ఆడ‌పిల్ల‌ల‌పై ఆన్‌లైన్‌లో అశుద్ధ ప్ర‌చారం త‌గునా? అది కూడా ధ‌నార్జ‌న కోసం.. అంటూ ప‌లువురు సునీత‌కు స‌పోర్ట్ చేస్తున్నారు. 

Tags : , , , , , , ,