
Kamal Haasan’s career has suffered a lot from the beginning and Kamal Haasan has never been humiliated in any of the places. Kamal Hassan has proved that Shruti Haasan is a heroine as a heroine and not a different and routine mentality in the subject of the daughter.Click on the below video to know more details of Shruti Hassan Ruined Her Career
హీరో కమల్ హాసన్ కి కెరీర్ మొదటి నుంచే అనేక దెబ్బలు తగిలాయి , ఎన్నో చోట్ల ఎన్నో అవమానాలు ఎదురుకొన్న కమల్ హాసన్ ఎప్పుడూ ఎక్కడా ఏ విషయం లో కూడా తగ్గింది లేదు. శృతి హాసన్ ని హీరోయిన్ గా ఇండస్ట్రీ అడుగు పెట్టించి అందరి లాగా కూతుళ్ళ విషయం లో డిఫరెంట్ , రొటీన్ మెంటాలిటీ తనది కాదు అని ప్రూవ్ చేసుకున్నాడు కమల్ హసన్. సహజీవనం దగ్గర నుంచీ అనేక విషయాల వరకూ తండ్రి వారసత్వం పుణికి పుచ్చుకున్న ఆమె ఈగో , పొగరు విషయం లో కూడా అలాగే ప్రవర్తిస్తోంది అంటున్నారు. ఈమె మొదట సింగర్‌గా, సంగీత దర్శకురాలిగా కూడా మంచి టాలెంట్‌ని చూపించింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో స్టార్ స్టేటస్‌ని సాధించింది. మొదట్లో ఆమె నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్‌లు అవుతూ ఐరన్‌లెగ్ అనిపించుకుంది. కానీ ‘గబ్బర్‌సింగ్’తో స్టార్‌గా అవతరించింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. కాగా ఆమె కొంతకాలంగా ఓ విదేశీయుడితో సహజీవనం చేస్తోంది.
బాగా మద్యానికి అలవాటు పడి అసలు తన వంటిపై శ్రద్దపెట్టడమే మానేసింది. దాంతో ఈ భామని చూస్తే ఇక ఫేడవుట్ అయినట్లేనని సన్నిహితులు అంటున్నారు. ‘కాటమరాయుడు’ చిత్రంలో నటించినప్పుడు కూడా ఈ అమ్మడి లుక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక తన ప్రియుడి ద్యాసలో పడటం, తండ్రి కూడా నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు జీవించు అని సలహా ఇవ్వడంతో ప్రియుడి మత్తులో పడి సహజీవనం చేస్తోంది. ఇక ఈ అమ్మడు మరలా పూర్వపు గ్లామర్‌ని పొందడం అసాధ్యమేనంటున్నారు. ఏ సినిమా కూడా ఒప్పుకోవడం లేదు. సంఘమిత్ర లాంటి మంచి సినిమాలో ఆఫర్ వచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పి పక్కన పడేసి ఆమె వేరే పనులు చూసుకుంది. ఆమె నిర్ణయం వలన ఆ సినిమా ఆగిపోతున్నా కూడా శృతి లెక్క చేయలేదు. కమల్ హాసన్ పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వబోతూ ఉంటె సామాజిక అంశాల మీద అతనితో పాటు పోరాటం చెయ్యడం కోసం శృతి సిద్దం అవుతోంది. తండ్రి కెరీర్ దాదాపు చరమాంకం లో ఉంది కాబట్టి ఆయన రాజకీయాలకి వెళ్ళినా వెళ్ళక పోయినా పరవాలేదు కానీ ఆమె చేతులారా ఈగో తో పొగరుతో మరొక పక్క నాన్నకి హెల్ప్ అంటూ కెరీర్ నాశనం చేసుకుంటోంది అంటున్నారు.
Tags : kamal haasan, kamal haasan daughter, kollywood shruti haasan, kollywood stars, london actor, michael corsale, shruti haasan boyfriend michael corsale, shruti haasan boyfriend name, shruti haasan boyfriend picture, shruti haasan films, shruti haasan lover, Shruti Hassan, shruti hassan boyfriend, Shruti Hassan Ruined Her Career, singer shruthi haasan, Telugu Stars, Tollywood News, అయ్యో చేతులారా కెరీర్ సర్వనాశనం చేసుకుంటోంది ఈ హీరోయిన్!