ఆరు ద‌శాబ్ధాలుగా అల‌రిస్తున్న గ్రేట్ మూవీ..!

admin
Mayabazar

ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై  తెలుగువాడి ఖ్యాతి వెలిగిపోయేలా చేసిన సినిమా `మాయాబ‌జార్‌`.

ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీఆర్, గుమ్మడి, రేలంగి, సావిత్రి వంటి దిగ్గ‌జాలు న‌టించిన ఈ సినిమా 27 మార్చి, 1957లో రిలీజైంది. కదిరి వెంకటరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్రేట్ మూవీ విడుదలై నిన్న‌టికి 60 ఏళ్లు పూర్తి అయింది. 

మాయాబ‌జార్ ఇటీవ‌లే డిజిట‌లైజ్డ్ అయ్యి క‌ల‌ర్ వెర్ష‌న్‌లో రిలీజై గ్రాండ్ స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. మ‌హాన‌టి సావిత్రి అస‌మాన ప్ర‌తిభ‌, ఎస్వీఆర్ న‌ట‌న ఈ సినిమాలో త‌ల‌మానికం. నాటి ప్రేక్ష‌కుల్ని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేసిన ఈ గ్రేట్ మూవీ ఇప్ప‌టికీ ఓ అద్భుత స్క్రీన్‌ప్లే గ్రంధంగా భావించి స్ట‌డీ చేస్తుంటారు న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు. ఇలాంటి అరుదైన చిత్రం ఈ ఏడాదితో 60 వ‌సంతాలు పూర్తి చేసుకుంది. 

వివహా భోజనంబు వింతైన వంటకంబు అహ్హ‌హ్మ హ్హ‌..,
ఆహా నా పెళ్లి అంట .. అహ‌నా పెళ్లంట…., 
లాహిరి లాహిరిలో…
తరాలు మారినా యుగాలు గడిచినా … ఇంత‌టి మ‌ధుర‌మైన ఆపాత మ‌ధురాలు.. జ‌న‌రంజ‌కంగా ఇప్ప‌టికీ తెలుగు బుల్లితెర‌ను ఏల్తున్నాయి.

Tags : , , , , , , , , , , , , , , , , ,