స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్ హీరోకి క్రేజీ ఆఫ‌ర్‌? | Slumdog Millionaire Hero Got A Crazy Offer

admin
dev

Dev Patel was the legend of Oscar’s film with Slumdog Millionaire. The youthful legend came in the news issue with champions the story putting in the news. What’s more, the film was later coated in Hollywood. Click on the below video to know more details of Slumdog Millionaire Hero Got A Crazy Offer

స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ చిత్రంతో ఆస్కార్ సినిమా హీరోగా పాపుల‌ర‌య్యాడు దేవ్ ప‌టేల్‌. ఈ యంగ్ హీరో క‌థానాయిక‌ల‌తో జోరుగా ఎఫైర్లు సాగిస్తూ బాగానే వార్త‌ల్లోకొచ్చాడు. అంతేకాదు ఆ సినిమా త‌ర్వాత అటు హాలీవుడ్‌లో మెరుపులు మెరిపించాడు. అక్క‌డ ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించి మంచి మార్కులే తెచ్చుకున్నాడు. `ది బెస్ట్ ఎగ్జోటిక్ మ్యారీగోల్డ్ హోట‌ల్‌`, `ది మేన్ హూ న్యూ ఇన్‌ఫినిటీ`, `హోటెల్ ముంబై`, `ల‌య‌న్‌` వంటి పాపుల‌ర్ చిత్రాల్లో న‌టించాడు దేవ్‌. ఇందులో `ల‌య‌న్‌` గొప్ప గొప్ప అవార్డుల్ని అందుకుని హాట్ టాపిక్ అయ్యింది. హాలీవుడ్‌లో ప‌లు క్రేజీ ఆఫ‌ర్లు ఇప్ప‌టికీ అత‌డిని వ‌రిస్తూనే ఉన్నాయి. ఆ క్ర‌మంలోనే దేవ్ ఇప్ప‌టికీ హాలీవుడ్ ద‌ర్శ‌కుల‌తో స‌త్సంబంధాలు నెరుపుతున్నాడు. అయితే ఇటీవ‌లి కాలంలో ఏమ‌య్యాడో కానీ ఈ కుర్ర‌హీరో పెద్దంత‌గా ఫోక‌స్‌లోకి రాలేదు. దీంతో స్ల‌మ్‌డాగ్ కుర్రాడు ఏమ‌య్యాడు? అంటూ ఒక‌టే ఆరాలు మొద‌ల‌య్యాయి.

హాలీవుడ్ డైరెక్ట‌ర్ మైఖేల్ వింటెర్‌బాట‌మ్ `ది వెడ్డింగ్ గెస్ట్‌` అనే సినిమాకి దేవ్‌ని క‌థానాయ‌కుడిగా ఎంపిక చేసుకోవ‌డం విశేషం. 2018 లో ఈ సినిమా ప్రారంభం కానుంది. కోల్‌క‌త‌లో మెజారిటీ పార్ట్ తెర‌కెక్క‌నుందిట‌. బ్రిటీష్ కౌన్సిల్ డెలిగేష‌న్‌లో భాగంగా ఆయ‌న కోల్‌క‌త పిలింఫెస్ట్‌కి ఎటెండ్ అయిన మైఖేల్ ఈ ప్రాజెక్టును క‌న్ఫామ్ చేశాడు. `వెల్‌కం టు స‌రాజీవో`, `ది రోడ్‌టు గ్వాంట‌నమో` చిత్రాల‌తో ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కుడిగా పేరు త‌చ్చుకున్న మైఖేల్ ద‌ర్శ‌క‌త్వంలో దేవ్‌కి అవ‌కాశం రావ‌డం అదృష్ట‌మే. అత‌డితో గ‌తంలోనూ కొన్ని సినిమాల‌కు దేవ్ ప‌ని చేశాడుట‌. లండ‌న్ బేస్డ్ కంపెనీ స్టోన్ పిక్చ‌ర్స్ (దీప‌క్ నాయ‌ర్‌, నిక్ బోవెర్ నిర్మాత‌లు) – రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి.

Tags : , , , , , , , , , , , , , , , , , ,