రాజశేఖర్ అంటే చాలా ఇష్టం | Sunil Emotional Speech About Hero Rajasekhar | Garuda Vega

admin
sunil

Sunil Emotional Speech About Rajasekhar dragged all the consideration. We realized that Garuda Vega Movie Success Meet has held fabulously. Click on the below video to know more details of Sunil Emotional Speech About Hero Rajasekhar

గత పదేళ్లుగా సరైన విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తోన్న హీరో రాజశేఖర్‌కు, దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నా కమర్షియల్ హిట్ రాక టాలెంటెడ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇద్దరూ గరుడవేగ రూపంలో గొప్ప సక్సెస్‌ను అందుకున్నారు. గతవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ‘గరుడ వేగ’ సక్సెస్‌ను ఆస్వాదిస్తోన్న టీమ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా మంగళవారం ఒక స్టార్ హోటల్లో జరిగిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్‌లో ఈ చిత్ర బృందం పాల్గొంది. వారితోపాటు ఇందులో హీరో సునీల్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన … ‘గరుడవేగ’ సినిమా విజయవంతమైనందుకు రాజశేఖర్‌కి అభినందనలు తెలియజేశాడు. రాజశేఖర్ అంటే తనకి ఎంతో అభిమానమనీ, ఒక హీరోగానే కాదు మనసున్న మనిషిగా ఆయనని ఇష్టపడతానని అన్నాడు. ‘రియల్ లైఫ్‌లోను ఆయన నాకెంతో సహాయం చేశారు .. ఒకసారి నా కూతురి ఆరోగ్యం బాగోలేనప్పుడు వైద్యం చేసి ప్రాణాలు కాపాడారని అన్నాడు. గరుడవేగ టీమ్‌తో కలిసి క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపాడు.

Tags : , , , , , , , , , , , , , , , , , ,