2018 త‌లైవా ర‌జ‌నీకాంత్‌దే | Super Star Rajinikanth Two Crazy Movies Releasing On 2018

admin
Rajini kanth

There is a saying, if Tiger steps back then don’t think it is accepting the defeat but it will jump ten steps forward in no time. If you remember a Superstar Rajni dialogue then yes, we are trying to make to remember a punchline from Rajni films. Click on the below video to know more details of
Super Star Rajinikanth Two Crazy Movies Releasing On 2018

2018 త‌లైవా ర‌జ‌నీకాంత్ న‌టించిన రెండు క్రేజీ సినిమాలు రిలీజ‌వుతున్నాయి. అంటే కొత్త సంవ‌త్స‌రం ర‌జ‌నీకాంత్‌దేన‌ని దీన‌ర్థం. ప్ర‌స్తుతం ఈ విష‌యంపై త‌మిళ మీడియాలో, తంబీల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా త‌లైవా అభిమానుల్లో అంత‌కంత‌కు క్యూరియాసిటీ రెయిజ్ అవుతోంది. ర‌జ‌నీ న‌టించిన రెండు క్రేజీ సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ‌వుతున్నాయి. ఈ ఏడాదిలో అంత‌కుమునుపు ఉన్న రికార్డుల‌న్నిటినీ తుడిచేసే సినిమాలివి.. అని జోశ్యం చెబుతున్నాడు. ఇంత‌కీ ఆ సినిమాలేవో అంద‌రికీ తెలిసిందే. తమిళ న్యూఇయర్ సందర్భంగా ఏప్రిల్ 13న ర‌జ‌నీ-శంక‌ర్ కాంబినేష‌న్‌లోని 2.ఓ (రోబో2) రిలీజ్ కానుంది. దాదాపు 450 కోట్ట బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాస్త‌వానికి రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 26న ఈ సినిమా రిలీజ‌వుతుంద‌ని తొలుత ప్ర‌క‌టించినా, ఆ త‌ర్వాత భారీ వీఎఫ్ఎక్స్ వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతుంద‌ని శంక‌ర్ బృందం ప్ర‌క‌టించింది. ఇక ఈ సినిమా స‌మ్మ‌ర్ ట్రీట్ ఇస్తుంద‌ని తాజా అప్‌డేట్ అందింది.

ర‌జ‌నీ న‌టిస్తున్న మ‌రో క్రేజీ సినిమా `కాలా` ఇండిపెండెన్స్ డే కానుక‌గా.. ఆగస్టు 15న రిలీజ్ కానుంది. `క‌బాలి` ఫేం పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. క‌బాలి త‌మిళంలో గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో అంత‌కుమించిన క్రేజుతో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు రంజిత్‌. ఇప్ప‌టికే కాలా పోస్ట‌ర్లు హైప్ క్రియేట్ చేశాయి. మునుముందు మ‌రిన్ని వివ‌రాల్ని వెల్ల‌డించేందుకు రెడీ అవుతోంది టీమ్‌. ఇక ఈ రెండు క్రేజీ సినిమాలు త‌మిళ్‌, తెలుగు ఆడియెన్ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల్లో ర‌జ‌నీ అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వ‌బోతున్నాయి. ఇలా ర‌జ‌నీ న‌టించిన రెండు క్రేజీ సినిమాలు రిలీజ‌వ్వ‌డం అన్న‌ది నాలుగేళ్ల త‌ర్వాత సాధ్య‌ప‌డుతోంది. 2014 త‌ర్వాత మ‌ళ్లీ 2018లోనే ఇలా ఒకే ఏడాదిలో ర‌జ‌నీ న‌టించిన రెండు సినిమాలు రిలీజ‌వుతుండ‌డంతో అభిమానుల్లో అంత‌కంత‌కు క్యూరియాసిటీ రెయిజ్ అవుతోంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,