సూర్య మార్కెట్ అంత‌కంత‌కు కిందికి! | Suriya Market Crashed In Tollywood | Market Downfall

admin
suriya

After superstar Rajinikanth, Surya is the next Tamil star hero to have created a market for himself in Telugu. Click on the below video to know more details of Suriya Market Crashed In Tollywood | Market Downfall

తెలుగు, త‌మిళ్‌లో హీరో సూర్య క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అయితే గ‌త కొంత‌కాలంగా సూర్య మార్కెట్ ఇక్క‌డ తిరోగ‌మ‌ణంలో ఉంద‌నేది డిస్ట్రిబ్యూట‌ర్ల రిపోర్ట్‌.. చెక్ దిస్ స్టోరి…

గజిని సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు సూర్య‌. ఆ ఒక్క సినిమాతో తెలుగులో పాపుల‌ర్ హీరో అయిపోయాడు. తెలుగు స్ట్రెయిట్ హీరోల‌కు ధీటుగా ఇక్క‌డ మార్కెట్‌ని కొల్ల‌గొట్టాడు. శివ‌పుత్రుడు, సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌, 24 వంటి సినిమాల‌తో విష‌యం ఉన్న హీరోగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నాడు. తెలుగులో సూర్య‌కు వీరాభిమానులేర్ప‌డ్డారు ఆ క్ర‌మంలోనే. ఇక సింగం సిరీస్‌తో మాస్‌లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించాడు. ప‌వ‌ర్‌ఫుల్ కాప్ పాత్ర‌లో మెప్పించిన సూర్య మాసివ్ హిట్స్‌ని అందుకున్నాడు. అత‌డికి మినిమంగా 20 కోట్లు పైగా ఇక్క‌డ మార్కెట్ ఏర్ప‌డింది. అయితే ఇటీవ‌లి కాలంలో ఊహించ‌ని ప‌రిణామం. అత‌డు న‌టించిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫెయిల‌వుతున్నాయి. రాంగ్ సెల‌క్ష‌న్స్ పూర్తిగా ఇమేజ్‌ని డ్యామేజ్ చేశాయి. ఈ ప‌రిణామం అత‌డి తెలుగు మార్కెట్‌ని ఘోరంగానే దెబ్బ తీసింద‌ని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే సూర్య రేంజ్ స‌గానికి ప‌డిపోయింది.

సూర్య న‌టించిన తాజా చిత్రం `తాన సెరింద కూట్ట‌మ్‌` తెలుగులో `గ్యాంగ్‌` పేరుతో రిలీజ‌వుతోంది. తెలుగు హ‌క్కులు 10 కోట్ల‌కు గీతా ఆర్ట్స్‌, యువి క్రియేష‌న్స్ సంయుక్తంగా ఛేజిక్కించుకున్నాయి. వాస్త‌వంగా సూర్య సినిమా అంటే మినిమం 18 -25 కోట్ల మ‌ధ్య డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ రేంజ్ పూర్తిగా ప‌డిపోయింది. అయితే ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే `గ్యాంగ్` సంచ‌ల‌న విజ‌యం సాధించాల్సి ఉంటుంది. అయితే సూర్య కి క్రేజు త‌గ్గ‌డంతో ఇప్పుడు గ్యాంగ్ సినిమాకి పంపిణీదారుల్లో అంత పెద్ద క్రేజు లేద‌ని చెబుతున్నారు. ఎలానూ గీతా ఆర్ట్స్‌, యువి క్రియేష‌న్స్ బ్రాండ్ ఉన్న సంస్థ‌లు .. ఫ్యూచ‌ర్‌లో భారీ చిత్రాల్ని అందిస్తున్నాయి కాబ‌ట్టి.. దూర‌దృష్టి కార‌ణంగా డిస్ట్రిబ్యూట‌ర్స్ సూర్య సినిమాని కొనుక్కోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఒక‌వేళ ఎవ‌రూ కొన‌క‌పోయినా సొంతంగానే రిలీజ్ చేసుకునే స్టామినా స‌ద‌రు నిర్మాత‌లు కం డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఉంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,