తార‌క్‌ను లైన్‌లో పెట్టిన ప్రేమమ్ డైరెక్ట‌ర్‌?

‘కార్తికేయ’ సినిమాతో త‌నదైన ముద్ర వేశాడు చందు మొండేటి. ఆ వెంట‌నే అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా ‘ప్రేమ‌మ్’ రీమేక్ తో మ‌రో విజ‌యం అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా తార‌క్‌నే టార్గెట్ చేశాడు.

`జ‌న‌తా గ్యారేజ్` హిట్ త‌ర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా విష‌యంలో సందిగ్దంలో ప‌డ్డాడు. పూరి జ‌గ‌న్నాథ్, త్రివిక్ర‌మ్ వంటి స్టార్ డైరెక్ట‌ర్లు లైన్ లో ఉన్నా ఎందుక‌నో ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు.  సీనియ‌ర్ రైట‌ర్ వ‌క్కంతం  వంశీ తార‌క్ తో సినిమా చేయాల‌నుకున్నాడు కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల అది కార్య‌రూపం దాల్చ‌లేదు. `ప‌టాస్` ఫేం అనీల్ రావిపూడి కూడా ఓ క‌థ చెప్పాడ‌ని ప్ర‌చారంలో ఉంది. తాజాగా మ‌రో యంగ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి కూడా తార‌క్ కు ఓ స్టోరీ చెప్పి ఒకే చేయించుకున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 

ఇప్ప‌టికే చందు 10 డిఫ‌రెంట్ జోన‌ర్  క‌థ‌ల‌ను సిద్ధం చేసి పెట్టుకున్నాడు. క‌మ‌ర్శియ‌ల్ ఫార్మెట్ ను అస్స‌లు ఫాలో చేయ‌డు. క‌థ‌లో కొత్త‌ద‌నం..గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవ‌డంలో చందు చాలా క్లారిటీ గా ఉంటాడు. మ‌రో ర‌కంగా చెప్పాలంటే ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌లో వెరీ ట్యాలెంటెడ్. అందువ‌ల్ల చందు క‌థ‌కు తార‌క్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదని అంటున్నారు. 

Add your comment

Your email address will not be published.