పిచ్చి ముదిరి చివ‌రికి పాక‌మైంది! | Teen Girl Undergoes 50 Surgeries To Look Like Angelina Jolie

admin
angelina joli

Sahar is an Iranian teenager – who claims to have gone under the knife 50 times in just a few months.The 19-year-old, who was born in February 1998, has also been on a strict diet, to get her weight down to 40kg. Clck on the below video to know more details of Teen Girl Undergoes 50 Surgeries To Look Like Angelina Jolie

అభిమానం అనే పిచ్చి ముదిరితే ఎలా ఉంటుందో ఇదిగో ఈ వీరాభిమానిని చూస్తే అర్థ‌మ‌వుతుంది. హ‌ద్దుమీరిన‌ అభిమానం .. గుడ్డి అభిమానం.. ఏ రేంజులో కొంప‌లు ముంచుతుందో చెప్పేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్‌. త‌న ఫేవ‌రెట్ ఏంజెలినా జోలీలా క‌నిపించాల‌ని పిచ్చిగా క‌ల‌లు గ‌న్న ఓ 19 ఏళ్ల అందాల రాశి ఏకంగా 50 సార్లు ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు, ఆప‌రేష‌న్లు చేయించుకుంది. ఏంజెలినాపై ఉన్న పిచ్చి అభిమానం ఇలా తెగించేందుకు కార‌ణ‌మైంది. ఫ‌లితం ఇదిగో ఇక్క‌డ చూస్తున్న ఈ ఫోటోనే..ప్రూఫ్‌. ఈ ఫోటోలో క‌నిపిస్తున్న అభిమాని పేరు త‌బ‌ర్‌. ఇరాన్ స్వ‌స్థ‌లం. ఏంజెలినాలా జీరోసైజ్ కోసం ప్ర‌య‌త్నించి 40 కేజీలు మించ‌కుండా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకునేది. కానీ చివ‌రికి విధి వ‌క్రించింది. ఫ‌లితం వేరేలా వ‌చ్చింది.

ఏంజెలినా ముక్కులా సాగ‌దీసుకోవాల‌నుకుంది. కానీ అది ఎటో సాగింది. ఇక ఏంజెలినా క‌ళ్ల‌లా క‌నిపించాలంటే అందుకు లెన్స్ వేసుకుంది. సొట్ట బుగ్గ‌ల కోసం అవ‌స‌రం మేర ఆప‌రేష‌న్లు చేయించుకుంది. ఆ త‌ర్వాత మారిన రూపం ఇదిగో ఇలా అయ్యింది. పిచ్చి ముదిరిపాకాన ప‌డితే ఏమ‌వుతుంది? అదే అయ్యిందిప్పుడు. అస‌లు ఈ అమ్మ‌డిని చూస్తుంటే ఏమ‌నిపిస్తోంది? బాబోయ్ దెయ్యం మీద ప‌డేట్టే ఉంది అనిపించ‌డం లేదూ? ఒకప్పుడు చక్కని చుక్కలా ఉండే తబర్.. త‌న ఫోటోల్ని, మారిన రూపాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆపరేషన్లకు ముందు తర్వాత అంటూ తన పాత.. ప్రస్తుత ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోల్ని చూసిన వాళ్లంతా.. బాబోయ్‌ దెయ్యంలా మారవని.. మంత్రగత్తె బతికించిన శవంలా ఉన్నావని చీవాట్లు వేస్తున్నారు. ఓసి నీ వీరాభిమానం పాడు కానూ!!

Tags : , , , , , , , , , , , , , , , , , , ,