`ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌-5`కి బాల‌య్య ఫ్యాన్స్‌లా విజిలేస్తారు!!

admin
transformers

అప్ప‌టివ‌ర‌కూ రోడ్ల‌పై ప‌రిగెడుతున్న ట్ర‌క్ ఉన్న‌ట్టుండి రూపం మార్చుకుని హ్యూమ‌న్‌ రోబోట్‌గా మారిపోతుంది. మ‌నుషుల‌తో సంభాషిస్తూ .. ఎమోష‌న్స్‌కి క‌నెక్ట‌వుతుంది. దుర్మార్గుడైన శ‌త్రువుపై దాడులు చేస్తుంది. అప్ప‌టిక‌ప్పుడే రంగులు మార్చుకునే ట్ర‌క్కులాగా మారిపోతుంది. త‌న ఓన‌ర్‌ని ఎక్కించుకుని ప‌రిగెత్తేస్తుంది.

సంద‌ర్భాన్ని బ‌ట్టి సాయ‌ప‌డే మంచి ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ ఉంటాయి. విల‌న్ ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌తో భారీ యుద్ధాలు ఉంటాయి. ఇవ‌న్నీ వీక్షించే ఆడియెన్ ఒక‌టే ఉత్కంఠ‌కు లోన‌వుతాడు. బాల‌య్య అభిమానిలా విజిల్స్ వేసి గోల గ‌గ్గోలు పెడ‌తాడు. ఇది ఐమ్యాక్స్ లాంటి చోట `ట్రాన్స్‌ఫార్మ‌ర్స్` సినిమాలు చూసిన‌వారికి అల‌వాటే.

అస‌లు ఈ ఐడియా ఎలా వ‌చ్చిందో కానీ, ఆ థాట్ ప్రాసెస్‌లోనే కిక్కుంది. రవితేజ కిక్ ఇచ్చిన కిక్కు వ‌ర‌ల్డ్ ఆడియెన్‌కి ఎక్కింది కాబ‌ట్టే.. ఇప్ప‌టికీ ఆ సిరీస్‌లో సినిమా వ‌స్తోంది అంటే చెవులి రిక్కించి వింటారు. క‌ళ్లు కాయ‌లు కాచిపోతాయ్‌. అస‌లు ట్రాన్స్‌ఫార్మర్స్ సిరీస్‌కి అడిక్ట్ అయిన ఆడియెన్ వ‌ర్గం ప్ర‌త్యేకించి ఉంటుందంటే న‌మ్మండి. మేధో వ‌ర్గాలు సైతం వావ్ అంటూ మెచ్చుకుంటారు.

భారీ యాక్ష‌న్‌తో పాటు, ఈ సిరీస్‌లో లాజిక్ సూప‌ర్భ్ అని మెచ్చుకుంటారు. అందుకే ట్రాన్స్‌ఫార్మర్స్ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన నాలుగు భాగాలు బంప‌ర్ హిట్‌. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఐదో సినిమా -`ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌-ది లాస్ట్ నైట్‌` బ‌రిలో దిగుతోంది. ఈనెల 21 రిలీజ‌వుతోంది. ఈ వార్త అభిమానుల‌కు నిజంగానే గుబులు రేపుతోంది. రిలీజ్ డే కోసం ఇప్ప‌టికే ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూపులు మొద‌ల‌య్యాయ్‌.

అస‌లు ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ సిరీస్ క‌థేంటి? అని మాత్రం ప్ర‌శ్నించ‌కూడ‌దు. అలా ప్ర‌శ్నిస్తే అది వెర్రిత‌న‌మే అవుతుంది. ఇవ‌న్నీ కేవ‌లం విజువ‌ల్ సెన్స్‌, విజువ‌ల్ క్రియేష‌న్స్ బేస్డ్‌లో తెరకెక్కుతున్న సినిమాలు. వీటిలో వీఎఫ్ఎక్స్ కోణం నుంచే సినిమాల్ని రూపొందిస్తుంటారు. అస‌లు క‌థేంటో కూడా తెలీకుండానే.. పూర్తిగా అర్థం కాకుండానే ఇప్ప‌టికే ఈ సిరీస్‌లో నాలుగు సినిమాలు వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొట్టాయి.. అంటే వాటి స్టామినా ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. హాలీవుడ్‌లోనే హైలీ రిస్కీ కాంప్లికేటెడ్ స్క్రీన్‌ప్లేస్‌తో సాగే సినిమాలుగా ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ సిరీస్ ని అభివ‌ర్ణించ‌వ‌చ్చు.

అందుకే సినిమా ఫ్లాట్ ఏంటి? అని ఎవ‌రినీ అడ‌గ‌కూడ‌దు. ఇందులో వీఎఫ్ ఎక్స్ .. యాక్ష‌న్ విన్యాసాలు ఎలా ఉన్నాయి? అని మాత్ర‌మే అడ‌గాలి. అంత క‌న్ఫ్యూజ‌న్‌గా ఉంటాయ‌ని దర్శ‌క‌నిర్మాత‌లే ప్ర‌మోట్ చేస్తుంటారు కూడా.

క‌థ కాక‌ర‌కాయ లేక‌పోతే మేమెందుకు వెళ్లాలి థియేట‌ర్‌కి అంటే మాత్రం మీరు నిజంగా మూర్ఖులే. వెళ్లి చూస్తేనే కదా అందులో ఉండే మ‌జా ఏంటో తెలిసేది. ఒక‌సారి కుర్చీలో కూచుంటే ఇక మ‌ళ్లీ క‌ళ్లు తిప్ప‌రు. తెర‌పై నుంచి క‌ళ్లు ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డం చాలా క‌ష్టం. మ‌ధ్య మ‌ధ్య‌లో మ‌ర మెషీన్లు వేసే జోకులు.. వేషాలు చూస్తే ఒక్కోసారి మీకు తెలీకుండానే బాల‌య్య ఫ్యాన్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఏమాత్రం క‌ల్మ‌షం లేకుండా హాయిగా న‌వ్వేస్తారు. అంత‌కుమించి భారీ యాక్ష‌న్‌కి క్లాప్స్ కొట్టి అల్ల‌రి చేయ‌కుండా ఉండ‌రు. ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ మేకోవ‌ర్, ఛేంజోవ‌ర్‌, ఛేజెస్ ఇలా ఏ కోణంలో చూసినా అసాధార‌ణ విన్యాసాలు క‌ట్టిప‌డేస్తాయి.

ఈసారి వ‌స్తున్న కొత్త సినిమా -పార్ట్ -5 విష‌యంలో ఆడియెన్ మాత్రం ఉత్కంఠ‌తో కుర్చీ అంచున కూచుంటార‌ని భ‌రోసానిస్తున్నారు మేక‌ర్స్‌. నార్వే, అరిజోనా, నార్తంబెర్లాండ్‌, సోట‌న్ హెంజ్ లాంటి మైండ్ బ్లోవింగ్ లొకేష‌న్ల‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించామ‌ని తెలిపారు మేక‌ర్స్‌.

Tags : , , , , , , , ,