1000 కోట్ల క్ల‌బ్‌లో ఏకైక హీరో!

600 కోట్ల క్ల‌బ్ సినిమాని తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిన ఏకైక హీరో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ ఇప్పుడు 1000 కోట్ల క్ల‌బ్‌ని తెలుగు సినిమాకి ప‌రిచ‌యం చేయ‌నున్నాడు

600 కోట్ల క్ల‌బ్ కాదు.. 1000 కోట్ల క్ల‌బ్‌ని తెలుగు సినిమాకి ప‌రిచ‌యం చేయ‌నున్నాడు. ఓ ప్రాంతీయ సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ‌విఖ్యాతం చేస్తున్న గ్రేట్ హీరో ప్ర‌భాస్‌. రేపు ఉద‌యం పుట్టిన‌రోజున అభిమానులు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేస్తున్నార‌న్న‌ది తాజా అప్‌డేట్‌. 

600 కోట్ల క్ల‌బ్ సినిమాని తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిన ఏకైక హీరో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. `ఈశ్వ‌ర్‌`, ‘రాఘవేంద్ర’, ‘వర్షం’, ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘ఛత్రపతి’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’ ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్‌’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రెబల్‌’, ‘మిర్చి చిత్రాల‌తో తెలుగునాట తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర‌య్యాడు. ఒకే ఒక్క సినిమాతో అత‌డేంటో ప్ర‌పంచానికి తెలిసొచ్చింది. మ‌న హీరో హాలీవుడ్ రేంజు అన్న తీరుగా అసాధార‌ణంగా ఎదిగిన ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం ‘బాహుబ‌లి-2’లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. 

‘బాహుబ‌లి’ చిత్రంతో 600 కోట్ల క్ల‌బ్ హీరోగా నిరూపించుకున్నాడు. దేశంలోనే టాప్-5 సినిమాల్లో ఒక‌టిగా ‘బాహుబ‌లి’ నిలిచింది. ఇక బాహుబ‌లి-2 చిత్రంతో 1000 కోట్ల క్ల‌బ్‌లో చేరే హీరోగా ముచ్చ‌టించుకుంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే మ్యాడ‌మ్ టుస్సాడ్స్‌లో ప్ర‌భాస్ మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌. అక్టోబ‌ర్ 23 ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  న్యూస్‌మార్గ్ స్పెష‌ల్ ఇది..  

Add your comment

Your email address will not be published.