అంద‌రివాడు.. అభిమానంలో `ప‌వ‌రు`న్నోడు |This is WHY Pawan Kalyan FANS LOVE Him | PK Mania

admin
andarivadu

అనంత విశ్వంలో వీరాభిమానం .. ఆశేష ఆద‌ర‌ణ పొందిన‌వాడు.. వీరాభిమానులు ఉన్న‌వాడు..

అంద‌రిలోనూ అంద‌రివాడిగా ఉండేవాడు ఎవ‌రు? అంటే టాలీవుడ్ కి సంబంధించినంత‌వ‌ర‌కూ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించే అభిమానులు చెబుతారు. అతడిపై ఉన్న అభిమానం అలాంటిది. కేవ‌లం సినీప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా ఇత‌ర‌త్రా రంగాల్లో ఉన్న ప్ర‌ముఖులు సైతం ప‌వ‌న్‌ని అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. ఇక కామ‌న్ జ‌నం అయితే ప‌వ‌న్‌ని ప్ర‌త్యేకమైన ప‌వ‌ర్ ఉన్న స్టార్‌గా చూస్తారు. అందుకే అత‌డు జ‌న‌సేనానిగా మారి పార్టీ పెట్టి ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నా అన‌గానే జ‌నం గొప్ప‌గా వెల్‌కం చెప్పారు. అత‌డు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌ల‌కు అంతే స‌పోర్టునిచ్చారు.

న‌టుడిగా, విలక్ష‌ణుడిగా, ధార్మిక నిబ‌ద్ధ‌త‌ ఉన్న‌వాడిగా, నీతినియ‌మం అనుస‌రించేవాడిగా, సామాన్యుడిగా, పేదోడి బ‌తుకు చిత్రం తెలిసిన‌వాడిగా.. బ‌డుగు.. బ‌క్క బాధ‌లు తెలిసిన‌వాడిగా.. రైతన్న క‌ష్ట‌న‌ష్టాలు క్రీగంటి చూపుతో చూసేవాడిగా… ప‌వ‌న్ పేరు తెచ్చుకుంటున్నాడు. నాయ‌కుడు అనేవాడు ఎలా ఉండాలి? అన్న విశ్లేష‌ణ‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ కోణంలో చూస్తున్న జ‌నాల‌కు అది అర్థ‌మ‌వుతోంది. ఉన్న‌ట్టుండి రాజ‌కీయాల్ని ఒక్క‌సారిగా పుక్కిట ప‌ట్ట‌క‌పోయినా హార్వార్డ్ యూనివ‌ర్శిటీ ప్రొఫెస‌ర్ల‌తోనే రాజ‌కీయ పాటాలు చెప్పించుకుంటూ ఆల్రెడీ రాజ‌కీయాల్లో ఉన్న‌వాళ్లు ఉలిక్కిప‌డేలా చేస్తున్నాడు.

ఇండ‌స్ట్రీలో అంద‌రివాడు.. బ‌య‌టా అంద‌రివాడు.. ఊరూ వాడా .. ప‌ల్లె ప‌ట్నం, దేశం- విదేశం.. ఇలా తేడానే లేదు. అన్నిచోట్లా ప‌వ‌న్ అభిమానులే. ప్ర‌తిక్ష‌ణం ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌తి మూవ్‌మెంట్‌ని ప‌రిశీలిస్తూ.. ఉత్కంఠ‌తో అభిమానంతో ఎదురు చూసేవాళ్లే ఉన్నారు.

హీరోలు.. ద‌ర్శ‌కులు.. దార్శ‌నికులు.. నిర్మాత‌లు.. క‌థానాయిక‌లు .. 24 శాఖ‌ల కార్మికులు.. ప‌వ‌న్ నామ జ‌పం చేస్తారంటే అది అత‌డిపై పెంచుకున్న అభిమానం వ‌ల్ల‌నే. అందుకే ప‌వ‌న్ అంద‌రివాడు అన్న టైటిల్‌కి యాప్ట్. ఫ్లాప్ సినిమాతో 40 కోట్ల వ‌సూళ్లు సాధించే స్టామినా ఒక్క ప‌వ‌న్‌కే సాధ్యం. హిట్టు కొడితే 100 కోట్లు కొల్ల‌గొట్టే సామ‌ర్థ్యం ప‌వ‌న్‌కి సాధ్య‌మైంది.

పొలిటికల్ కారిడార్‌, మీడియా కారిడార్ అన్నిచోట్లా అభిమానం సంపాదించుకున్న స్టార్ అత‌డు. 24/7 వార్త‌లు అందించే టీవీ చానెల్ అధిపతులే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి అభిమానులుగా ఉన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. భ‌విష్య‌త్ రాజ‌కీయ చిత్రాన్ని మార్చే శ‌క్తి ఉన్న ఏకైక ప‌వ‌ర్ కేవ‌లం ప‌వ‌న్‌కే సాధ్యం అని చెప్పేందుకు సింబాలిజం క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల బ‌రిలో త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్నా అత‌డి బ‌లం స‌రిపోద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువడుతున్నాయి. అయితే బ‌లం పెంచుకునేందుకు తానేం చేయ‌బోతున్నాడు.? ఎన్నిక‌ల రాజ‌కీయ చిత్రంలో అత‌డు ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేస్తాడు? అన్న‌ది ఆస‌క్తిరేకెత్తిస్తున్న పాయింట్. చూద్దాం అభిమ‌న్యుడిలా చిక్కుకోకుండా అర్జునుడిలా రాజ‌కీయ ప‌ద్మ‌వ్యూహాన్ని ఎలా చేధిస్తాడో ప‌వ‌ర్‌స్టార్‌? రాజ‌కీయ రావ‌ణ కాష్టంలో రామ బాణంలా దూసుకుపోతాడా లేదా? వెయిట్ వెయిట్ వెయిట్‌..

Tags : , , , , , , , , , , , ,