మెగాస్టార్ లో ఆ క్వాలిటి అంటే…

మెగాస్టార్ చిరంజీవి ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ ఒదిగా ఉంటారు. త‌న స‌క్సెస్ కార‌ణం అభిమానుల‌తో పాటు ఆ డౌన్ టు ఎర్త్ ఫార్ములాను బాగా న‌మ్ముతారు.

మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే వాళ్లు సాధార‌ణ ప్రేక్ష‌కుడే కాదు..టాలీవుడ్ దిగ్గ‌జాలు కూడా ఆయ‌న్ను ఎంత‌గానే అభిమానిస్తారు. ప‌రిశ్ర‌మ‌లో వ్య‌క్తిగ‌త విష‌యాలు ఎలాఉన్నా చిరంజీవి పెర్పామెన్స్..హ‌ర్డ్ వ‌ర్క్ ను ఎవ‌రైనా మెచ్చుకోవాల్సిందే..తాజాగా ఆయ‌న‌లో మాన‌వీయ కోణం గురించి న‌టుడు పోసాని కృష్ణముర‌ళీ ఇలా చెప్పుకొచ్చారు.

చిరంజీవి గారికి ఎప్పుడు న‌మ‌స్కారం చేసినా తిరిగి అంతే గౌర‌వంతో విష్ చేస్తారు. ఆయ‌న‌లో ఆ క్వాలిటీ నాకు బాగా న‌చ్చింది. చిరంజీవితో ఎంత కాల‌మైనా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. చిరుతో మీరు మాట్లాడండి..మాట్ల‌డ‌క‌పోండి ఎప్పుడు ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఓ న‌మ‌స్కారం పెట్టామంటే ఎవ‌రికైనా అంతే మ‌ర్యాద ఇస్తారు. హ్యూమ‌న్ క్వాలిటీలో ఆయ‌న చిరంజీవులు. ‘ఖైదీ నెంబ‌ర్ 150’ వ‌ సినిమా 150 రోజులు ఆడాల‌ని కోరుకుంటున్నా. నాకు బాగా నచ్చిన ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ సినిమా చేయ‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌ని తెలిపారు.

Add your comment

Your email address will not be published.