టాలీవుడ్ షిఫ్ట్‌.. విశాఖ లేదా అమ‌రావ‌తికి? | Tollywood Industry Shift To Visakapatanm Or Amaravati

admin
tollywood

Telugu Film Industry shift to Vishakapatnam or amaravati . Will the film business move from Hyderabad? Is there another film industry in Visakapatnam or Amravati? That is the thing that appears to be correct. Click on the below video to know more details of Tollywood Industry Shift To Visakapatanm Or Amaravati

హైద‌రాబాద్ నుంచి సినీప‌రిశ్ర‌మ త‌ర‌లిపోనుందా? వైజాగ్ లేదా అమ‌రావ‌తిలో కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు స‌న్నాహాలు సాగుతున్నాయా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఆ మేర‌కు అధికారికంగా ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఓ ప్రెస్ రిలీజ్‌ని పంపించ‌డం తాజాగా సంచ‌ల‌న‌మైంది. డీప్‌గా వివ‌రాల్లోకి వెళితే..

అవిభాజ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండుగా విడిపోయిన‌ప్పుడు సినీప‌రిశ్ర‌మ ఎటు వెళుతుంది? అన్న ప్ర‌శ్న త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే విశాఖ న‌గ‌రంలో సినీప‌రిశ్ర‌మ పాదుకుంటుంద‌న్న ప్ర‌చారం సాగింది. అయితే ఎట్ట‌కేల‌కు విశాఖ న‌గ‌రానికి సినీప‌రిశ్ర‌మ త‌ర‌లింపుపై చంద్ర‌బాబు సినీపెద్ద‌ల‌తో స‌మాలోచ‌న‌లు చేయ‌డం ఏపీ, తెలంగాణ‌లో ప్ర‌స్తుతం చ‌ర్చ‌కొచ్చింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ విశాఖ లేదా అమ‌రావ‌తికి త‌ర‌లించే అంశాన్ని సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్నామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిన్న‌టిరోజున నంది అవార్డుల వేళ త‌న‌ని క‌లిసిన సినీపెద్ద‌ల స‌మ‌క్షంలో ప్ర‌క‌టించారు. విశాఖ, అమరావతిలో ఎక్కడికి తరలించాలన్న అంశంపై అన్ని వర్గాలతో సమాలోచన చేస్తున్నామని వ్యాఖ్యానించ‌డం సంచ‌ల‌న‌మైంది. సాగర నగరం విశాఖకు తరలించాలని మెజారిటీ ప్ర‌ముఖులు, సామాన్య జ‌నం కోరుతున్నారని, రానున్న కాలంలో అమరావతి నగరం ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాలలో ఒకటి కానున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటేనే సమంజసంగా ఉంటుందని భావిస్తున్నామని ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేశారుట‌. అంతేకాదు.. ఏపీ క‌మ్యూనికేష‌న్స్ విభాగం కార్యాల‌య స‌ల‌హాదారు నుంచి అధికారికంగా ఓ ప్రెస్ రిలీజ్‌ని పంపించ‌డం విశేషం.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో నిలదొక్కుకునేలా అక్కడ అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, ఇప్పుడు సొంత రాష్ట్రానికి వస్తామని పరిశ్రమలోని అత్యధికుల నుంచి వస్తున్న వినతుల్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ ఇక్కడ పరిశ్రమను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. సహజ అందాలతో విలసిల్లే విశాఖ, గోదావరి జిల్లాలు తెలుగు, తమిళ సినిమాల షూటింగులకు ముఖ్య చిరునామాగా ఉండేదని గుర్తుచేశారు. విశాఖలో సినీ స్టూడియోలు నిర్మించేందుకు ఇప్పటికే అనేకమంది ముందుకు రావడం సంతోషదాయకమని చెప్పారు. విశాఖ, అమరావతిలో పరిశ్రమ ఎక్కడికి తరలివచ్చినా ఇబ్బంది లేదని, విశాఖ బ్యుటిఫుల్ రెడీమేడ్ సిటీ అయితే, అమరావతి ఫ్యూచర్ సిటీ అని అభివర్ణించారు. గ‌త కొంత‌కాలంగా హైద‌రాబాద్‌లోని సినీపెద్ద‌ల్లో ప‌రిశ్ర‌మ త‌ర‌లింపు విష‌య‌మై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంద‌న్న టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌తో కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటుపై క్లారిటీ వ‌చ్చిన‌ట్టే. ఇప్ప‌టికే ఏపీ ఎఫ్‌డీసీ కార్య‌క‌లాపాలు ప్రారంభించింది. ఎఫ్‌డీసీ పాల‌క‌వ‌ర్గాన్ని చంద్ర‌బాబు నియ‌మించ‌నున్నారు. అయితే అమ‌రావ‌తి కంటే బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రానికే సినీప‌రిశ్ర‌మ త‌ర‌లి వెళ్లే ఆస్కారం ఉంద‌న్న అభిప్రాయం మెజారిటీ పార్ట్ సినీపెద్ద‌ల్లో వినిపిస్తోంది.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,