ద‌స‌రా బ‌రిలో రేసుగుర్రాలు..టార్గెట్ @500 కోట్లు

సెప్టెంబ‌ర్ మాసం సినిమాల‌ జోరే జోరు. ఈ నెల‌లో ద‌స‌రా పండుగ హుషారే హుషారు.. ఈసారి పండ‌క్కి అదిరిపోయే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్లు బ‌రిలోకి దూసుకొస్తున్నాయ్‌.


అస‌లే రుతుప‌వ‌నాలు.. వాటితో వ‌చ్చే వ‌ర్షాలు మొద‌లై శీత‌ల స‌మీరం ఒంటిని హాయిగా తాకుతున్న వేళ‌… ఈ నెలలో వేడెక్కించే యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్లు విరుచుకుప‌డ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సీజ‌న్‌లో బాక్సాఫీస్ కొల్ల‌గొట్టాల‌న్న‌దే ప‌న్నాగం కావొచ్చు. ద‌స‌రా సెల‌వుల్ని ఎన్‌క్యాష్ చేసుకుని గోనెసంచుల్లో డ‌బ్బు నింపుకునే ప్లాన్‌లో వ‌స్తున్నారంతా. ముఖ్యంగా ముగ్గురు స్టార్లు.. మ‌హేష్‌, ఎన్టీఆర్‌, బాల‌య్య బాక్సాఫీస్ దండ‌యాత్రే ల‌క్ష్యంగా బ‌రిలో దిగుతున్నారు. ఈ ద‌స‌రా బెట్టింగ్ దాదాపు 500 కోట్లు ఉంటుంద‌న్న‌ది ప్రాథ‌మిక అంచ‌నా. చెక్ దిస్ స్టోరీ…

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ – ఏ.ఆర్‌.మురుగ‌దాస్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న క్రేజీ బ‌హుభాషా చిత్రం `స్పైడ‌ర్‌`. ఈ సినిమాకోసం నిర్మాత‌లు ఠాగూర్ మ‌ధు, ఎన్వీ ప్ర‌సాద్ ఏకంగా 110 కోట్లు పైగానే బ‌డ్జెట్ పెట్టారు. అందుకు త‌గ్గ‌ట్టే తెలుగు, త‌మిళ్, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ మార్కెట్ల‌ను టార్గెట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇంత భారీ కాన్వాసులో అంత క్రేజీ హీరో, క్రేజీ డైరెక్ట‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాగా ఈ సినిమా దాదాపు 300 కోట్ల వ‌సూళ్ల‌ను టార్గెట్ చేశార‌ని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ద‌స‌రా పేరుతో ఏకంగా ఆరు రోజుల సెల‌వుల్ని క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. సెల‌వుదినాలు కాబ‌ట్టి స్పైడర్ అంత‌కుమించి వ‌సూళ్ల‌ను ల‌క్ష్యించినా ఆశ్చర్యం అక్క‌ర్లేదు. తమిళ్‌, హిందీలో మురుగ‌దాస్ హ‌వా న‌డుస్తున్న వేళ ఆ ల‌క్ష్యం చిన్న‌దే.

ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న `జై ల‌వ‌కుశ‌` సెప్టెంబ‌ర్ 21న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతోంది. ఈ సినిమాకి ఆరంభ‌మే 100 కోట్ల బిజినెస్ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని చెప్పుకున్నారు. ఆ స్థాయిలోనే ప్రీరిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. అంటే ఈ సినిమా మినిమం టార్గెట్ 150 కోట్ల షేర్‌.

ఇక‌పోతే మ‌రో వారం గ్యాప్ తో అంటే సెప్టెంబ‌ర్ 29న న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ వెనిగ‌ళ్ల ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న `పైసా వ‌సూల్‌` రిలీజ్ కానుంది. ఈ సినిమా పూరి మార్క్ సినిమా కాబ‌ట్టి హిట్ అన్న టాక్ వ‌స్తే మినిమం 50కోట్లు వ‌సూలు చేస్తుంద‌న్న అంచ‌నాలున్నాయి.

ఇక బాల‌య్య‌ను 100 కోట్ల క్ల‌బ్ హీరోని చేసే స‌త్తా కూడా పూరీకి ఉంది. ఒక‌వేళ ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్న టాక్ తెచ్చుకుని బాల‌య్య కెరీర్‌లో మ‌రో మైలురాయిని తాకినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అందుకే ఇవ‌న్నీ క‌లిపితే .. ఏకంగా బాక్సాఫీస్ వ‌ద్ద 500 కోట్ల మేర బెట్టింగ్ షురూ అయిన‌ట్టేన‌ని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ద‌స‌రా పండ‌గ అంటే ఇత‌ర‌త్రా చిన్నా చిత‌కా సినిమాలు చాలానే ఉంటాయి. అవ‌న్నీ అద‌నం.

ఇక 30 సెప్టెంబ‌ర్ ద‌స‌రా కానుక‌గా వ‌స్తున్న క్రేజీ టాప్‌-3 సినిమాల రిలీజ్ తేదీల్ని ఓ మారు గుర్తు చేసుకుంటే.. మ‌హేష్ స్పైడ‌ర్ సెప్టెంబ‌ర్ 21న, ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సెప్టెంబ‌ర్ 27న రిలీజ‌వుతున్నాయి. ఇక బాల‌య్య‌బాబు `పైసా వ‌సూల్‌`
సెప్టెంబ‌ర్ 29న రిలీజ్ కానుంది. అదీ సంగ‌తి.

Add your comment

Your email address will not be published.