నిఖిల్ పార్టీలో వ‌రుణ్ సందేశ్ ఎందుకు మిస్స‌య్యాడు?

admin
nikhil party

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో నిఖిల్ కేవ‌లం డైరెక్ట‌ర్ల‌నే పిలిచి ఎందుకు పార్టీ పెట్టాడు? హ్యాపీడేస్ ప‌దేళ్లు పూర్తి చేసుకున్న వేళ త‌న‌తో పాటు ఆ సినిమాలో న‌టించిన హీరోల్ని ఎంద‌కు పిల‌వ‌లేదు.

ముఖ్యంగా సినిమాలో న‌టించిన మెయిన్ హీరో వ‌రుణ్ సందేశ్‌ని ఈ యంగ్ హీరో ఎందుకు పిల‌వ‌లేదు? మ‌రిచిపోయాడా? అంటూ టాలీవుడ్ లో ఒక‌టే ముచ్చ‌ట్లు సాగుతున్నాయి. మ‌రి వీటికి నిఖిల్ స‌మాధానం చెబుతాడా?

నిఖిల్ .. త‌న కెరీర్ ప‌ది వ‌సంతాలు పూర్తి చేసుకున్న వేళ త‌న ద‌ర్శ‌కులంద‌రినీ పిలిచి ఓ పార్టీ ఎరేంజ్ చేశాడు. ఈ పార్టీలో త‌నకు తొలి అవ‌కాశం ఇచ్చిన శేఖ‌ర్ క‌మ్ముల స్పెష‌ల్ గెస్ట్‌. క‌మ్ముల త‌న‌కి అవ‌కాశం ఇవ్వ‌క‌పోయి ఉంటే ఏమ‌య్యేవాడినో అంటూ నిఖిల్ కాస్తంత ఉద్వేగంగానే మాట్లాడాడు ఈ పార్టీలో.

అవ‌కాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వేళ ఎవ‌రూ ఛాన్సివ్వ‌క‌పోతే క‌మ్ముల అవ‌కాశం ఇచ్చి ఆదుకున్నార‌ని నిఖిల్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. హ్యాపీడేస్ రిలీజై ప‌దేళ్ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా క‌మ్ముల పార్టీ చేయ‌క‌పోయినా, నిఖిల్ గుర్తుంచుకుని మ‌రీ పార్టీ ఇచ్చాడు. అన్న‌ట్టు ఈ పార్టీలో హ్యాపీడేస్‌లో న‌టించిన ఇత‌ర హీరోలెవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. నిఖిల్ కేవ‌లం డైరెక్ట‌ర్ల‌నే పిలిచి పార్టీ ఇచ్చాడేంటో.? మ‌రి హీరోల్ని పిల‌వ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటో?

సినిమా ఇండస్ట్రీలోకి గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం అంతే కష్టం. తొలి సినిమాలో మంచి పేరొచ్చినా వన్ ఫిల్మ్ వండర్ గా మిగిలిపోయే వాళ్లు చాలామంది ఉంటారు. వరస ఫ్లాపులతో కెరీర్ పట్టాలు తప్పుతున్న సమయంలో తనను తాను జడ్జ్ చేసుకుని తిరిగి కెరీర్ ను రైట్ ట్రాక్ లో పెట్టుకోవడం చాలా అవసరం. యంగ్ హీరో నిఖిల్ సక్సెస్ ఫుల్ గా పదేళ్లపాటు కెరీర్ పూర్తి చేసుకున్నాడంటే త‌న జ‌డ్జిమెంట్ పెద్ద స‌క్సెసైంది కాబ‌ట్టే.

పదేళ్ల క్రితం వచ్చిన హ్యపీడేస్ సినిమా తెలుగు తెరకు కొత్త టాలెంట్ ను పరిచయం చేసింది. అందరూ కొత్త వాళ్లతోనే తీసిన సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. ఇందులోని చాలామంది నటులకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల మంచి ప్లాట్ ఫాం ఇచ్చాడు. ఆ సినిమాలో రాజేష్ క్యారెక్టర్ లో కనిపించిన నిఖిల్ తర్వాత జాలీగా తిరిగే కుర్రాడి గెటప్ లో చాలా సినిమాల్లో కనిపించాడు. ఒకటి రెండు సినిమాల తర్వాత అతడిని ఫ్లాపులే పలకరించినా .. స్వామి రారా సినిమాలో ఓ కొత్త లుక్ తో తెరపై కనిపించి హిట్ కొట్టాడు. అప్పటి నుంచి అతడి ఖాతాలో అన్నీ హిట్లే. టెన్ ఇయర్స్ కెరీర్ కంప్లీట్ అయిన సందర్భంగా నిఖిల్ తాజాగా చిన్న పార్టీ అరేంజ్ చేశాడు. ఈ ఫంక్షన్ కు తనతో పనిచేసిన డైరెక్టర్లందరినీ ఆహ్వానించి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.

అయితే ఇలా ద‌ర్శ‌కుల‌కు ట్రీటిస్తే స‌రిపోతుందా? హ్యాపీడేస్ చిత్రంతోనే వ‌రుణ్ సందేశ్‌, వంశీ కృష్ణ, శ్రావ్స్ రాహూల్ ప‌రిచ‌యం అయ్యారు. మ‌రి ఇలాంటి ఆనందం పంచుకునే వేళ ఎందుకు వారిని నిఖిల్ ఆహ్వానించ‌లేదు అంటూ ప‌రిశ్ర‌మ‌లో మాట్లాడుకుంటున్నారు. పిలిచి ఉంటే ఇంకా హుందాగా ఉండేది క‌దా! అంటూ మాట్లాడుకుంటున్నారు. ఎనీవే ..నెక్ట్స్ ఇంకేదైనా హీరోల మీట్ ఉంటుందేమోలే?

Tags : , , , , , , , , , , , , ,