వెంకటేష్ విజయ్ దేవరకొండ మల్టీ స్టారర్ సినిమా! | Venkatesh & Vijay Deverakonda in a Multi Starrer ?

admin
venkatesh

Hero Venkatesh is one of the coolest films that we all know and the cool attribute that he has come to remember.click on the below video to know more details of Venkatesh & Vijay Deverakonda in a Multi Starrer ?

హీరో వెంకటేష్ అనగానే మనకి కూల్ సినిమాలు అంతకి మించి ఆయన కి ఉండే కూల్ యాటిట్యూడ్ ఇవన్నీ గుర్తుకు వస్తాయి.

యంగ్ హీరోలతో కలిసి నటించి మల్టీ స్టారర్ లకి ట్రెండ్ సెట్ చేసిన హీరో వెంకటెష్. సీనియర్ హీరోగా మహేష్ బాబు , రాం , పవన్ కళ్యాణ్ , కామల్ హాసన్ ఇలా అందరితో జతకట్టి మల్టీ స్టారర్ కి కొత్త నిర్వచనం ఇచ్చారు వెంకటెష్. మహేష్ బాబు తో వెంకటేష్ చేసిన బ్లాక్ బస్టర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గురించి ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాం మనందరం. ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ సినిమా మన మనసులలో పెద్దోడు , చిన్నోడు అనే కాన్సెప్ట్ లోనే ఉండిపోయింది. ఇక పోతే రాం తో మసాలా అనే సినిమా తీసినా అది ప్లాప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల అంటూ హిందీ సినిమా రీమేక్ చేసాడు వెంకటేష్ పవన్ కళ్యాణ్ ని దేవుడిగా కొలుస్తూ భక్తుడుగా వెంకటేష్ నటించాడు. ఈ సినిమా పరవాలేదు అనిపించే కలక్షన్ లు రాబట్టింది. కమల్ హసన్ తో ఈనాడు అనే చిత్రాన్ని ఇది కూడా హిందీ చిత్రం రీమేక్.

ఇప్పుడు ఇదంతా చెప్పేది దేనికి అంటే తాజా సంచలనం అర్జున్ రెడ్డి లో హీరోగా చేసిన విజయ్ దేవరకొండ తో వెంకటెష్ ఒక మల్టీ స్టారర్ సినిమా చెయ్యబోతున్నాడు అంటూ ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య విడుదల అయ్యి సూపర్ హిట్ కొట్టిన గురు సినిమా తరవాత వెంకీ ఇప్పటి వరకూ ఒక్క చిత్రం కూడా ఓకే చెప్పలేదు. అసలు ఆయన ప్రాజెక్ట్స్ కి సంబంధించి వెంకటేష్ నోరు కూడా విప్పలేదు. ఏడాదికి మూడు సినిమాలు చేసే మినిమం గ్యారెంటీ హీరో ఇప్పుడు సినిమాలు నెమ్మదిగా చేస్తూ గ్యాప్ తీసుకోవడం పరిశ్రమ లో కూడా విమర్సల కి తావు ఇస్తోంది. ఇంకెంతోకాలం కెరీర్ లేని వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా సినిమాలు సాగదీస్తూ ఉంటె ఎట్లా అంటున్నారు సినిమా జనాలు. అయితే వెంకటేష్ లెక్క వేరేలా ఉంది. చేసేవి కొద్ది సినిమాలే అయినా కూడా చాలా డిఫరెంట్ గా చెయ్యాలి అని ప్లాన్ వేసాడు ఆయన. త్వరలో ఆయన ఒక సినిమా చెయ్యబోతున్నారు అని తెలుస్తోంది. ఇందులో యంగ్‌ హీరోగా ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ విజయ్‌ దేవరకొండ వెంకటేష్‌తో కలసి నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సీనియర్‌ స్టార్‌ విక్టరీ వెంకటేష్‌తో కలసి నటించేందుకు ‘అర్జున్‌రెడ్డి’ కంటే ముందే విజయ్‌ దేవవకొండ ఓకే చెప్పాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్‌ న్యూస్‌ని మేకర్స్‌ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి భాస్కర్‌ దర్శకత్వం వహించనున్నాడు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మించనున్నాడు. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ సినిమా తరవాత విజయ్ అప్పుడే ఒక మల్టీ స్టారర్ సినిమా మొదలు పెట్టడం చాలా పెద్ద విషయం.

Tags : , , , , , , , , , , , , , , ,