విజయ్ కి పవన్ కళ్యాణ్ తో పోలికా ? బుర్రా బుద్ధీ ఉందా? |Vijay Deverakonda Vs Pawan Kalyan

admin
vijay

ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాలో నానీ పక్కన కనపడి సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హడావిడి చేసి ఇంటర్వెల్ బ్యాంగ్ లో చనిపోయే విజయ్ దేవరకొండ ఆ సినిమాలోనే తన నటన తో అద్భుతం అనిపించాడు.

ఒక హీరోకి కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నా కూడా మరొక హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చెయ్యడానికి ఎలాంటి సంకోచం చూపించలేదు విజయ్. ఆ సినిమాతోనే అతని కెరీర్ కి మంచి నాంది పడింది. ఆ తరవాత వచ్చిన పెళ్లి చూపులు చిత్రం విజయ్ దేవరకొండ కి అద్భుతమైన బ్రేక్ ఇవ్వగా ఆ సినిమా ఓవర్ సీస్ లో సైతం మంచి కలక్షన్ లు రాబట్టింది. అర్జున్ రెడ్డి అంటూ ఇప్పుడు థియేటర్ లలోకి వచ్చిన విజయ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అప్పట్లో శివ ఇప్పుడు అర్జున్ రెడ్డి అన్నట్టుగా ఉంది వ్యవహారం. ప్రేమ ఫైల్యూర్ స్టోరీ తో ఎన్నో తెలుగు సినిమాలు ఉన్నా అభినందన రేంజ్ లో అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసున్నారు ప్రేక్షకులు.

ప్రేక్షకులతో పాటు క్రిటిక్ లు కూడా ఈ సినిమా అద్భుతః అంటున్నారు. సాధారణంగా క్రిటిక్ లు ఎవ్వరూ కూడా సినిమాలని అంతగా పొగడరు కానీ అర్జున్ రెడ్డి ఇప్పుడు వారి మనస్సులో కూడా ఒక ట్రెండ్ సెట్టర్. ఇక ఇలాంటి చిత్రమే మరో సినిమా తీయమని చెప్పినా ఆ దర్శకుడు తీయలేడేమో అన్నది వాస్తవం. ఇక విజయ్‌ దేవరకొండలో ఉన్న మైనస్‌ ఏమిటంటే… ఆయన విభిన్న చిత్రాలకు ప్లస్‌ అవుతాడే గానీ రొటీన్‌ కమర్షియల్‌ చిత్రాలకు పెద్దగా సూట్‌కాడు. ఈ విషయాన్ని ‘పెళ్లిచూపులు’ తర్వాత వచ్చిన ‘ద్వారక’ చిత్రం నిరూపించింది. ‘పెళ్లి చూపులు’కి వచ్చిన క్రేజ్‌ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయిందనే చెప్పాలి. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో పాటు చాలామంది ఈ హీరోని పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ ఉండడం మాత్రం ఒకింత ఆశ్చర్యంగా ఉంది అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడూ తన నటన ద్వారా ఫాన్స్ ని సంపాదించుకోలేదు. కేవలం వ్యక్తిగతంగా అతని ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ చూసిన జనాలు అతనంటే పడి చస్తారు. తిరుగులేని ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్న వ్యక్తి అతను. సౌత్ ఇండియా లో రజినీకాంత్ తరవాత అతికే అంతటి ఫాన్స్ ఉన్నాయి అని మీడియానే ఓపెన్ గా చెబుతోంది. ఇలాంటి పరిస్థితి లో కొత్తగా వచ్చిన చిన్న హీరోలని పవన్ తో కంపేర్ చెయ్యడం చాలా హాస్యాస్పదం. అనుభవం లో కానీ వయసులో కానీ సినిమాల లిస్టు లో కానీ పవన్ తో ఏ మాత్రం సరితూగని ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ తో పోల్చడం అంటే అది పవన్ పేరు చెప్పుకుని తమ గొప్పతనం పెంచుకోవడమే అవుతుంది తప్ప ఇంకేదీ కాదు.

Tags : , , , , , , , , , , , , , , , , ,