నేటి నుంచి కోలీవుడ్ బంద్‌?|What? STRIKE in Kollywood? | Tamil Film Industry

admin
kollywood

It is an ongoing war in all film industries. Workers have been battling that salaries are not properly and the work time is not out of order, taking out the sourcing and striking their stomach.click on the below video to know more details of What? STRIKE in Kollywood? | Tamil Film Industry

కార్మికులు- నిర్మాత‌ల కొట్లాట గురించి ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు.

అనాదిగా అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లో కొన‌సాగుతున్న యుద్ధ‌మే. జీత‌భ‌త్యాలు స‌రిగా లేవ‌ని, ప‌ని స‌మ‌యం క‌రెక్టుగా లేద‌ని, ఔట్ సోర్సింగు తీసుకుని త‌మ పొట్ట కొట్టేస్తున్నార‌ని కార్మికులు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఉపాధి క‌రువైన‌ప్పుడు క‌డుపు మంట ఎలా ఉంటుందో పెద్ద‌న్న‌ల‌కు తెలిసొచ్చిన సంద‌ర్భాలున్నాయి. అయితే నిర్మాత వైపు నుంచి చూస్తే.. సినిమా బ‌డ్జెట్ త‌గ్గించుకోవ‌డం.. ఖ‌ర్చు త‌గ్గించుకుని బండి లాగించ‌డం అన్న ప‌ద్ధ‌తి ఉంటుంది. అయితే ప‌రిశ్ర‌మ‌లోని 24 శాఖ‌ల‌కు సంబందించి కొన్ని నిర్దిష్ఠ‌మైన నియ‌మ‌నిబంధ‌న‌లు ఉన్నప్పుడు వాటిని ఫాలో చేయ‌డం ఇటు కార్మికుల‌కు, అటు నిర్మాత‌లకు నిర్భంధ‌మైన‌ విధి అనే చెప్పాలి. అయితే అప్పుడ‌ప్పుడు నిర్మాతలు అతి తెలివితేట‌లు చూపించి మొద‌టికే ముప్పు తెచ్చుకుంటున్నారు. ఒక్కో స‌మ‌స్య‌ చూసే కోణాన్ని బ‌ట్టి ఉంటుంది. కార్మికుల కోణంలో చూస్తే.. ప‌రిశ్ర‌మ నుంచి కాకుండా ప‌రిశ్ర‌మేత‌ర కూలీల్ని తెచ్చుకుంటే అది నేరం. నిర్మాత‌లు న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం ఇదే విష‌యంపై కోలీవుడ్‌లో ధ‌ర్నాకు ప్లాన్ తెర‌లేచింది.

కార్మిక యూనియ‌న్ నుంచి కాకుండా బ‌య‌టి నుంచి .. అదీ ఓ కాలేజ్ నుంచి విద్యార్థుల్ని తీసుకుని షూటింగుకి ఉప‌యోగించుకోవ‌డంతో అస‌లు చిక్కులు వ‌చ్చి పడ్డాయి. దీంతో త‌మిళ నిర్మాత‌ల సంఘం (టిఎఫ్‌పీసీ)ని వ్య‌తిరేకించిన ఫెఫ్సీ (కార్మిక సంఘం) నేటి నుంచి ధ‌ర్నాకు దిగేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది. ఆ మేర‌కు యూనియ‌న్ అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శుల నుంచి పిలుపు వ‌చ్చింది. నేటి సాయంత్రం 4 గంట‌ల‌కు ధ‌ర్నాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. ప్ర‌తిభావంతులైన టెక్నీషియ‌న్ల‌ను ఎంపిక చేసుకునే హ‌క్కు నిర్మాత‌కు ఉన్నా.. ఇలా యూనియ‌న్ నుంచి కాకుండా కాలేజ్‌ల నుంచి ప‌నికి కుదుర్చుకుంటామంటే ఎలా? అంటూ ఫెఫ్సీ ప్ర‌శ్నిస్తోంది. ఇదివ‌ర‌కూ బంద్ జ‌రిగిన‌ప్పుడు నిర్మాత‌ల‌తో జ‌రిగిన ఒప్పందం ఉల్లంఘ‌న జ‌రిగింది. అందుకే మ‌రోసారి ధ‌ర్నాకు ఉప‌క్ర‌మిస్తున్నార‌ని తెలుస్తోంది.

అయితే బంద్ ప్ర‌భావం ప‌లు భారీ చిత్రాల షూటింగుల తో పాటు చిన్న సినిమాల‌పైనా ప‌డ‌నుంది. ర‌జ‌నీకాంత్ `కాలా` స‌హా ఇప్ప‌టికే సెట్స్‌లో ఉన్న ప‌లు చిత్రాల‌పైనా ప‌డ‌నుంది. కొద్ది రోజుల పాటు ఈ స‌న్నివేశం ఇలానే కొన‌సాగితే ఆ మేర‌కు షెడ్యూల్స్ దెబ్బ తిని న‌ష్టాలు త‌ప్ప‌దు. ఆర్.కె.సెల్వ‌మ‌ణి సార‌థ్యంలో ఈ స్ట్రైక్ వివ‌రాలు నేటి సాయంత్రం వెలువ‌డ‌నున్నాయి.

Tags : , , , , , , , , , , , , , ,